
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు…
మార్చి 28న పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు, 29న గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దిగ్బంధనం చెస్తాం..
*తెలుగువార్త* :
(ఆదోని)
దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి అని రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు, సిఐటియు పిలుపునిచ్చారు.
కార్మిక హక్కులు, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, రైతాంగాన్ని, వ్యవసాయ కూలీలను నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యోగులు రైతులు కూలీలు దేశవ్యాప్తంగా రెండు రోజులపాటు సమ్మె నిర్వహిస్తున్నారని, మార్చి 28న పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు, 29న గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల దిగ్బంధనం, హర్తళ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే లింగన్న, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామాంజనేయులు, రైతు సంఘం మండల కార్యదర్శి శేఖర్, సిఐటియు నాయకులు హనుమంతరెడ్డి, పెద్ద హనుమంత్ రెడ్డి, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు శ్రీ కృష్ణ, ఆటో యూనియన్ నాయకులు నాగార్జున తెలియజేశారు.