సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలి

తెలుగు వార్త. న్యూస్.
మేనేజ్మెంట్ ట్రైనీ శిక్షణా తరగతులను ప్రారభించిన
ఏరియా జనరల్ మేనేజర్ బి.వెంకటయ్య
8 ఇంక్లైన్ కాలనీ
ఆర్జీ2 ఏరియా, 8 ఇంక్లైన్ కాలనీ, సింగరేణి సంస్థలో నూతనంగా నియమించబడిన ఎక్స్టర్నల్ మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, హైడ్రో జియాలజీ విభాగాలకు చెందిన అభ్యర్థులకు ఇండక్షన్ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరిగింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్య గారు ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ శిక్షణలో 29 మంది ట్రైనీ మైనింగ్, ఇద్దరు హైడ్రో జియాలజీ ట్రైనీ లు పాల్గొన్నారు. వీరికి రెండు వారాల పాటు సింగరేణి సంస్థలోని వివిధ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది.
క్లిష్టమైన మైనింగ్ పనులలో ఇష్టంతో కష్టపడి పని చేయాలని కంపెనీలో ఉత్పత్తి ఉత్పాదకతను తమ వంతుగా చాలా నిబద్ధతతో, క్రమశిక్షణతో భావితరాలకు సింగరేణి తల్లిని తలమానికరం చేసే బాధ్యత మీ అందరి మీద ఎంతో ఎక్కువగా ఉందని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి వెంకటయ్య గారు తెలిపారు. కొత్త తరం ఉద్యోగాలు మరియు అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే సంస్థ మనుగడ సాధిస్తుందని పోటీ ప్రపంచంలో ప్రతిభ, సామర్థ్యం, పని సంస్కృతలను పెంచుకుంటూ ముందుకు సాగాలని నిరంతరం నేర్చుకుంటూ సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు.
ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తికి సంస్థ ఎదుర్కుంటున్న బొగ్గు నాణ్యతా, భూ సమస్యలు, ఫారెస్ట్ అనుమతులు, సాంఘిక స్థితిగతులను గురించి క్షుణ్ణంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో డిజిఎం నిమ్ ఎస్డీఎం హుస్సైనీ, డిజిఎం సిమ్టార్స్ జీవీఎన్ విజయ్ కుమార్, డీజీఎం డిజిఎం ఐఇ మురళీకృష్ణ, ఏరియా సెక్యూరిటీ అధికారి షరీఫ్ మహ్మద్ మరియు మేనేజ్మెంట్ ట్రైని శిక్షణ తరగతుల వచ్చిన అభ్యర్థులు పాల్గొన్నారు