ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATEWORLD

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

స్నేహితుని కుటుంబానికి సాయం చేసిన పూర్వవిద్యార్థులు

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

స్నేహితుని కుటుంబానికి సాయం చేసిన పూర్వవిద్యార్థులు

వెల్దుర్తి, మార్చి 25, (తెలుగు వార్త న్యూస్) :

అనారోగ్యంతో మృతి చెందిన తోటి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి వెల్దుర్తి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1993- 94 పదో తరగతికి చెందిన పూర్వ విద్యార్థులు స్నేహ బంధాన్ని చాటుకున్నారు. గత ఏడాది డిసెంబర్ 12న 1993- 94 (ఎస్‌ఎస్‌సి) బ్యాచ్‌ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం వెల్దుర్తి ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. వెల్దుర్తి ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ తోటి మిత్రులతో కలిసి గురువులను ఘనంగా సన్మానం చేశారు. అందరూ ఒక్కటయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అయితే టి. వీర ప్రకాష్ నాయుడు అనారోగ్య కారణంగా జనవరి 20న అందరినీ వదిలి అనంత లోకాలకు వెళ్లి పోయాడు. తమ మిత్రుడు వీర ప్రకాష్ నాయుడు కుటుంబాన్ని ఆదుకోవాలని సంకల్పంతో మిత్రులందరూ కలిసి తమవంతుగా 43,500… సాయం చేశారు. అందులో అంత్యక్రియలకు పదివేల రూపాయలు, మరియు 30 వేల రూపాయలను బ్యాంక్‎లో డిపాజిట్ చేసిన పత్రాలతో పాటు 3,500/- నగదును శుక్రవారం అందరూ కలిసి కుటుంబ సభ్యులకు అందించారు. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తమకు తెలియజేయాలని ప్రకాష్ భార్య కు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగన్న సురేష్ సంపత్ మద్దయ్య సాదిక్ శ్రీధర్ ఖాజా హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!