సంక్రాంతి సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలి…డి ఎస్ పి రామాంజి నాయక్

తెలుగు వార్త. న్యూస్.ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గం సంక్రాంతి పండగను సాంప్రదాయ బద్ధంగా జరుపుకోవాలని అసాంఘికలాపాలకు కఠిన చర్యలు తప్పవని ఆత్మకూరు డిఎస్పి . రామాంజి నాయక్ తెలిపారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఎస్ పి అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు ఆత్మకూరు డి ఎస్ పి రామాంజి నాయక్ పలు సూచనలు చేశారు. ముందుగా ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలకు అయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సంక్రాంతి పండుగకు సొంత ఊర్లకు వెళ్ళునప్పుడు సంబంధించిన పోలీసు స్టేషన్ లలో సమాచారం ఇచ్చి వెళ్లవలెనని తెలిపారు విలువైన బంగారు, వెండి అభరణాలను మరియు నగదును మీ వెంట తీసుకువెళ్లాలి. లేదా బ్యాంక్ లాకర్ లలో భద్రపరచుకొని వెళ్ళాలి.మీ ఇంటికి వేసే తాళాన్ని కటాంజనము(గ్రిల్)నకు/ గేటుకు లోపలి వైపు నుండి వేయవలెను.ఇంటికి వేసిన తాళము కనపడకుండా డోర్ కర్టన్ వేసుకోవాలి.ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలలో లైటింగ్ ఉండేటట్లు చూసుకోవాలి.సైబర్ క్రైమ్ నేరాల గురించి చాలా జాగ్రతగా ఉండాలి. సంక్రాంతి బంపర్ ఆఫర్ అని మీకు ఈ లింక్ ను క్లిక్ చేస్తే ఉచిత రీఛార్జి అని ఆశ చూపిస్తారు. మీ సెల్ కి వచ్చిన ఎటువంటి లింక్ లను క్లిక్ చేయవద్దు. మీరు క్లిక్ చేస్తే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు అన్నీ ఖాళీ అవుతాయి. మీరు మీ ఇంట్లో గల మైనర్ పిల్లలకు మీ యొక్క వాహనములను ఇవ్వరాదు. ఇస్తే వారు ఏదైనా ఆక్సిడెంట్ చేస్తే వాహన యజమాని ముద్దాయి అవుతాడు. కావున ఎట్టి పరిస్తితులలో కూడా మైనర్ లకు వాహనములను ఇవ్వరాదు.సంక్రాంతి సెలవులలో నీటి కుంటలలోనూ, బావులలోనూ, కాలువలలోనూ ఈదడానికి పిల్లలు వెళ్ళి మునిగి చనిపోతుంటారు. కావున పిల్లలను గమనిస్తూ ఉండాలి. పండుగ సమయాలలో తాగి వాహనాలను నడుపుట మరియు బైక్ లకి సైలెన్సర్ తీసి ఎక్కువ శబ్దాలను చేస్తూ నడిపితే మీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి.మీరు బస్సులు ఎక్కు, దిగు సమయములలో మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రతగా చూసుకోవాలి. సీటు కోసం విలువైన వస్తువులు ఉన్న బ్యాగ్ లను సీట్లలో వేయరాదు. బస్సులు/రైలు లో ఎక్కిన తరువాత తెలియని వారు ఇచ్చిన తినుబండారాలను తీసుకొని తినరాదు.సాం ప్రదాయక క్రీడలు మినహా మరి ఏ ఇతర కోడి పందెములు గాని, పేకాట గాని, క్రికెట్ బెట్టింగ్, పొట్టేలు పందెములు, గుండ్లు ఎత్తడము మరి ఏ ఇతర జూదములు ఆడుట నిషేదము. ఆడినచో జూదము నిర్వహకున్ని, ఆడినవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి అని అన్నారు