
నంద్యాల తెలుగు వార్త న్యూస్ :- నంద్యాల జిల్లా స్థానిక సాయిబాబా నగర్ N3 పాఠశాల లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ స్వరూప రాణి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు టీచర్లు మెగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్ సి కోటారెడ్డి గారు, ఎక్సేంజ్ సీఐ జయరాం గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మహిళా పోలీస్ అధికారి ఎం శ్రీలక్ష్మి గారు జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ నారాయణ విద్యాసంస్థ ఏ.జీ.ఎం. ప్రశాంత్ గారు ఆర్ ఐ చంద్రమౌళి గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి ఉన్నారు, లిరింగ్ ఎక్స్లెన్స్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్ తల్లిదండ్రుల సమావేశం గురించి మాట్లాడుతూ పిల్లలు చదవడం రాయడం లెక్కించటం అనే ప్రాథమిక నైపుణ్యాలు జీవితానికి పునాది అని పిల్లల భవిష్యత్తుకు అత్యంత అవసరం అందుకు మా పాఠశాల నిర్వహిస్తున్న ఎల్ ఎస్ పి బీ పీ సీ అనే ప్రోగ్రాం గురించి క్లుప్తంగా వివరించారు, ఎన్.సీ. కోటారెడ్డి మాట్లాడుతూ జీవితానికి పునాది పాటలు అందులో టీచర్ తల్లిదండ్రులు సమన్వయ కృషితో పిల్లలని తమ్ము నిర్ణయించుకున్న మంచి భవిష్యత్తు చేరుకోగలరని చెప్పారు, జయరాం గారు శక్తి గురించి అమ్మాయిలు సెల్ఫ్ డిసిప్లేన్ తో ఎలా ఉండాలో తెలుసుకోవాలని వారి టీం సహకారం మినీ డెమో ద్వారా ఆరోగ్య సూత్రాలు వివరించారని ఇలా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉజ్వల భవిష్యత్ కు పునాది కేవలం చదువుతూనే ప్రారంభం అవుతుందని తెలిపారు, అనంతరం ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వివిధ అధికారులు తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని విజయవంతం చేశారని, దాదాపుగా 250 మంది విద్యార్థుల తల్లిదండ్రులు మెగా పేరెంట్స్ సమావేశానికి హాజరయ్యారని N3 నారాయణ విద్యాసంస్థ ప్రిన్సిపల్ స్వరూప రాణి తెలిపారు