
గురు రాజా లో BRAIN BOX ఐఐటి ఫౌండేషన్ అవగాహన
సదస్సు నిర్వహణ ..
గురు రాజా స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి….
నంద్యాల. తెలుగు వార్త :-నంద్యాల పట్టణం ఎన్జీవో కాలనీ నంద్యాల శ్రీ గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 5,6,7,8 తరగతుల చదువుచున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఐఐటి ఫౌండేషన్ మరియు ప్రాముఖ్యతను గురించి పాఠశాల ఆవరణంలో అవగాహన సదస్సు నిర్వహించిన ట్లుగా పాఠశాల డైరెక్టర్ తెలిపారు. ఈ అవగాహన సదస్సు నందు విద్యార్థులకు బాల్య దశ నుంచే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ (PCMB) సబ్జెక్టుల నందు భవిష్యత్తులో అ
ప్రతిభ కనబరిచి అత్యున్నత పరిజ్ఞానాన్ని సాధించాలనే లక్ష్యంతో వచ్చే విద్యా సంవత్సరంలో బ్రెయిన్ బాక్స్ ఐఐటి ఫౌండేషన్ ద్వారా ఒలంపియాడ్ నీట్ ఇంజనీరింగ్ సివిల్ సర్వీస్ వంటి రంగాలలో విజయాలు సాధించడానికి ఈ ఫౌండేషన్ ద్వారా ఆధునికత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యా విధానంతో ప్రతిభ కలిగిన చిన్నారులకు ఓరియంటేషన్ శిక్షణ ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని విద్యార్థులకు తల్లిదండ్రులకు ఐఐటి నందు అనుభవజ్ఞులు, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయుల చే బోధన నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ తల్లిదండ్రుల విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఐటి ఉపాధ్యాయ బృందం కోఆర్డినేటర్స్ పాల్గొన్నారు.