ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

జర్నలిస్ట్ లపై అక్రమకేసులు మానుకోవాలి

వాస్తవాలు రాస్తున్న జర్నలిస్ట్ లపై అక్రమకేసులు మానుకోవాలి

 

జర్నలిస్ట్ లపై కేసులు పెట్టడం పత్రిక గొంతు నొక్కడమే

 

ఏపీడబ్ల్యూజేఎఫ్, జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా

 

కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 24, (తెలుగు వార్త న్యూస్):

 

జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టులకు పోలీస్ అధికారులు నోటీస్ లు ఇవ్వడం హేయమైన చర్య ఇలాంటి నోటీసులు ఇవ్వడం పోలీస్ లు మానుకోవాలని పత్రిక స్వేచ్ఛను హరించడం తప్ప ఇంకొకటి కాదని ఏపీడబ్ల్యూజేఎఫ్ ,జర్నలిస్ట్ ల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోరంట్లప్ప, కె.బి శ్రీనివాసులు,జిల్లా కన్వీనర్ నాగేంద్ర ,ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు డి.హుస్సేన్, సీనియర్ జర్నలిస్టు సత్యనారాయణ గుప్తా,సాక్షి బ్యూరో రవి వర్మ,ఎన్. టివి కరస్పాండెంట్ చంద్రశేఖర్, టివి 9 కరస్పాండెంట్ నాగిరెడ్డి,సాక్షి కరస్పాండెంట్ లోకేష్,వార్త స్టాఫ్ రిపోర్టర్ రవి ప్రకాష్, సీనియర్ జర్నలిస్ట్ లు నీలం సత్యనారాయణ,అవినాష్, లు మాట్లాడుతూ గత నెల ఆదోని,కర్నూలు పత్తికొండ లో పని చేస్తున్న వివిధ పత్రికల జర్నలిస్టులు రాసిన వార్తలకు నోటీస్ లను ఇచ్చారు.అదోనిలో వన్ టౌన్ పోలీసులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నారని ప్రజాశక్తి దినపత్రికలో రాసిన వార్తకు స్టాఫ్ రిపోర్టర్ వినయ్ కుమార్ కు ఆదోని వన్ టౌన్ వారు,ఆదోని రూరల్ పోలీస్ వారు నోటీస్ లు ఇచ్చారు.అలాగే కర్నూలు నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 11న బోరుగడ్డ అనిల్ కు మళ్ళీ రాచ మర్యాదలే శీర్షికతో రాసినందుకు వార్త దినపత్రిక స్టాఫ్ రిపోర్టర్ రవి ప్రకాష్ కు పోలీస్ లు నోటీస్ లు ఇచ్చారు. ఆలూరు లో టివి 9 ,పత్తికొండ లో ఆంధ్రప్రభ,హంస వాయిస్,విశాలాంధ్ర, జర్నలిస్టులకు నోటీస్ లు ఇచ్చారు. నేడు పోలీస్ లే కిడ్నపర్స్ అవతారం ఎత్తి అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో రాసిన వార్త కు సాక్షి జర్నలిస్ట్ కె.బి శ్రీనివాలుకు పోలీస్ లు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం బెదిరింపులకు గురిచేయడం తప్ప ఇంకొకటి కాదు. ఇదే వార్తను పలు రకాల చానల్స్, పేపర్స్ లలో ప్రచురణ జరిగింది.కానీ కేవలం సాక్షి జర్నలిస్టుల పై కేసులు నమోదు చేయడం టార్గెట్ చేయడం భయబ్రాంతులకు గురిచేయడం తప్ప ఇంకొకటి కాదన్నారు.వాస్తవాలు రాసిన జర్నలిస్టులకు నోటీస్ లు ఇవ్వడం అంటే ప్రజల గొంతు పత్రిక స్వేచ్చ ను హరించడం తప్ప ఇంకొకటి కాదన్నారు.వాస్తవాలు రాస్తున్న జర్నలిస్టులను బెదిరింపులకు గురిచేయడం కోసమే ఇలాంటి నోటీసులు ఇస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఇలాంటి ధోరణి ని పోలీస్ అధికారులు చేయడం బాధాకరం.వార్తలు రాసిన వాటిపై విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం మానేసి పత్రిక గొంతు నొక్కడం సమంజసం కాదని తెలిపారు.జర్నలిస్టుల రక్షణ కోసం పోలీస్ లు హామీ ఇచ్చేలా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.తక్షణమె ఇలాంటి చర్యలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే ఈ ఘటనలపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్ర ఆందోళనలో చేస్తున్నారని రాబోవు రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.అనంతరం డిఆర్వో వెంకట నారాయణమ్మ కు వినతిని అందించారు.ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ కో కన్వీనర్ రమేష్, సీనియర్ జర్నలిస్ట్ లు రాజశేఖర్ నాయుడు,శ్రీనాథ్ రెడ్డి, విజయ్ కుమార్,శివ శంకర్, కర్నూలు ప్రభ నజీర్, ఉరుకుందు, రామకృష్ణ,ప్రతాప్,శ్రీనివాసులు,విజయ కరణ్, దామోదర్,అనిల్,శేఖర్, జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!