
రాష్ట్రస్థాయి క్రీడాకారులకు క్రీడా దుస్తుల పంపిణీ.
_____________________________________________
26-3-2022 నుండి27-3-2022 వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎస్ఏఎపి ఖో ఖో లీగ్ పోటీలు నెల్లూరు జిల్లాలో నిర్వహించబడును. ఈ పోటీలో పాల్గొనడానికి కర్నూలు జిల్లా జట్టుగా ఆత్మకూరు నుండి క్రీడాకారులు బయల్దేరుతున్నారని కర్నూలు జిల్లా ఖో ఖో అసోసియేషన్ కార్యదర్శి పి. ప్రభాకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానంలో, క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. సక్రు నాయక్ సభాధ్యక్షులుగా వ్యవహరించి క్రీడా దుస్తులను రాష్ట్ర స్థాయి క్రీడాకారులకు వి. నాగరాజు చేతులమీదుగా పంపిణీ చేయడం జరిగినది . క్రీడాకారు లను ఉద్దేశించి వి.నాగరాజు మాట్లాడుతూ…. నెల్లూరు లో జరిగే రాష్ట్ర స్థాయి కోకో పోటీలలో పాల్గొని అత్యంత ప్రతిభ కనబరిచి, విజయం సాధించాలని, అదేవిధంగా మీరు మంచి క్రమశిక్షణ కలిగి ఉండాలని, భవిష్యత్తులో ప్రతిభ గల క్రీడాకారులుగా తయారు కావాలని, జాతీయస్థాయిలో పాల్గొని, జిల్లాకు ఆత్మకూరు నకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. అదేవిధంగా భవిష్యత్తులో క్రీడాకారులకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని క్రీడాకారులకు భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయురాలు చరిత, వ్యాయామ ఉపాధ్యాయులు జె .వి .పద్మలత, మరియు సీనియర్ క్రీడాకారుడు ఎ ఎండీ . రఫిక్,అల్తాఫ్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు.