
అభాగ్యులకు సేవ చేయడం జీవితానికి సార్ధకత.. పూర్వజన్మ సుకృతం
తెలుగు వార్త న్యూస్:వరదయ్యపాలెం
శ్రీసిటీ సమీపంలో బత్తులవల్లం వద్ద ఘనంగా శ్రీ చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభోత్సవం
ముఖ్య అతిథిలుగా శ్రీసిటీ డీఎస్పీ జగదీష్ నాయక్, శ్రీ హౌసింగ్ అధినేత మదన్ రాజు
పేద పిల్లల విద్యాప్రగతి, వికలాంగుల సంక్షేమం, ఇతర సామాజిక సేవే ట్రస్ట్ పరమావధి: ట్రస్ట్ అధ్యక్షుడు శ్రావణ్
అభాగ్యులకు సేవ చేయడమే జీవితానికి సార్ధకత, భగవంతుని సేవతో సమానమని శ్రీసిటీ డీఎస్పీ జగదీష్ నాయక్ అన్నారు.
వరదయ్యపాలెం మండలం బతులవల్లం వద్ద చిలమత్తూరు మార్గంలో శ్రీసిటీ సమీపంలో శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ను శ్రీసిటీ డీఎస్పీ జగదీష్ నాయక్, శ్రీ హౌసింగ్ అధినేత మదన్ రాజు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మదన్ రాజు మాట్లాడుతూ సామాజిక సేవ చేయడం పూర్వ జన్మ సుకృతం అని, పేద పిల్లల విద్యా ప్రగతికి పలు సామాజిక సేవలకు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు .
అనంతరం శ్రీ చిల్డ్రన్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ శ్రావణ్ మాట్లాడుతూ పేద పిల్లల విద్యా ప్రగతికి, వికలాంగులకు చేయూతకు, గర్భిణీలు, ప్రమాదాలలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుల ప్రాణ రక్షణకు తక్షణ వైద్య సేవలు అందించేలా అంబులెన్స్ వసతి కల్పించే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ఆశయమని అన్నారు
అనంతరం పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు తెలుగు వార్త రిపోర్టర్ వెట్టీ.ఇళయరాజ , శంకరు విజయ్ హేమంత్ ri వెంకటసుబ్బయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.