నూతన రెవిన్యూ డివిజన్ అధికార కార్యాలయం
నూతన రెవిన్యూ డివిజన్ అధికార కార్యాలయం ను ప్రారంభించిన ఎమ్మెల్యే లు శిల్పా చక్రపాణి రెడ్డి,తోగురు ఆర్థర్.

నూతన రెవిన్యూ డివిజన్ అధికార కార్యాలయం ను ప్రారంభించిన ఎమ్మెల్యే లు శిల్పా చక్రపాణి రెడ్డి,తోగురు ఆర్థర్.
=================================
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
కర్నూలు జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని కరివేన గ్రామ సమీపంలో నూతన రెవెన్యూ డివిజన్ అధికార కార్యాలయాన్ని శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ చేతులమీదుగా రిబ్బన్ కట్ చేసి సోమవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీవో ఎం. దాసు ను అభినందించారు. ఆర్డీవో ఎం. దాస్ మాట్లాడుతూ… ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ… నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మకూరులో రెవిన్యూ డివిజన్గా చేయడం సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గం ప్రజల పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని మీ ప్రాంతంలో నూతన ఆర్డీవో కార్యాలయం ను ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంను ఉద్దేశించి నందికొట్కూరు ఎమ్మెల్యే తోగురు ఆర్థర్ మాట్లాడుతూ… నియోజకవర్గంలోని ప్రజలు పాస్ బుక్ లు కావాలంటే భూమి సమస్యలు తెలుసుకోవడానికి కర్నూలు వెళ్ళవలసి ఉండేది. ప్రజల ఎన్నో దశాబ్దాల కల సాకారం చేసిన మా వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చొరవతో సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమం నందు వైసిపి నాయకులు భువనేశ్వర్ రెడ్డి, మండల ఎంపిపి ఎన్. తిరుపాలమ్మ, సింగిల్విండో చైర్మన్ సురేష్, మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.