మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని సన్మానించిన జోహా హాస్పిటల్ నిర్వాహకులు.
తెలుగు వార్త :న్యూస్

మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని సన్మానించిన జోహా హాస్పిటల్ నిర్వాహకులు.
==============================
తెలుగు వార్త న్యూస్:ఆత్మకూరు పట్టణం.
ఆత్మకూరు పట్టణంలో నూతన జోహా హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. నూతన జోహా హాస్పటల్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ని నూతన జోహ నిర్వహకులు పుష్పగుచాలు అందించి శాలువ వేసి సన్మానించారు. ఆత్మకూరు పట్టణ ప్రాంత ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా చూడాలని, రోగులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత హాస్పటల్ నిర్వాహకులపై ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని హాస్పిటల్ నిర్వాహకులను కోరారు. ప్రజలు కూడా నూతన జోహా హాస్పిటల్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జోహా హాస్పిటల్ నిర్వాహకులు మాట్లాడుతూ… ఈ నూతన హాస్పటల్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.