
కబడ్డీ టీంను అభినందించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్..
క్రీడలతో పాటు మానసిక మానసిక ధైర్యం పెరుగుతుంది…
కామారెడ్డి , మార్చి 24, (తెలుగు వార్త న్యూస్) :
కామారెడ్డి పట్టణ కేంద్రంలో గురువారం రోజున 18,19,20, వ తేదీలలో వికారాబాద్ జిల్లాలో రాష్ట్రస్థాయి అండర్ – 20 మహిళా కబడ్డీ విభాగంలో తృతీయ స్థానం సాధించిన కామారెడ్డి జిల్లా జట్టును గురువారం కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్, జిల్లా విద్యాశాఖాధికారి రాజు, జిల్లా యువజన క్రీడల అధికారి దామోదర్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని సత్తా చాటి జిల్లాకు గుర్తింపు తెచ్చారని కొనియాడారు. క్రీడాకారులకు క్రీడా దుస్తులను అడ్లూర్ ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ లక్ష్మీపతి అందించారని వ్యాయామ ఉపాధ్యాయుడు నగేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్లూర్ఎల్లారెడ్డి ఉప సర్పంచ్ చింతల లక్ష్మీపతి, సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు లింభారెడ్డి, వార్డు మెంబర్ మొసర్ల శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ క్రీడాకారుడు జడల రాకేశ్ , శ్రీధర్, కామారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రమేష్ గౌడ్ , చీఫ్ కోచ్ నగేష్ , కోచ్ నాగరాజు , మేనేజర్ సునీత , కామారెడ్డి జిల్లా TGPETA అధ్యక్ష కార్యదర్శులు హీరాలాల్ స్వామిగౌడ్ , వ్యాయామ ఉపాధ్యాయులు రసూల్, సాయిమౌర్యా, నర్సింహారెడ్డి అడ్లూర్ఎల్లారెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి పాల్గొన్నారు.