ఆత్మకూరులో లక్కీ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపు ప్రారంభం

ఆత్మకూరులో లక్కీ ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపు ను ప్రారంభించిన డాక్టర్ రాయుడు, డాక్టర్ మన్సూర్ భాష.
తెలుగు వార్త. న్యూస్: ఆత్మకూరు టౌన్.నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ముల్లంగి కాంప్లెక్స్ ఆర్కే బేకరీ ఎదురుగా లక్కీ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాపును ప్రారంభిస్తున్నట్లు ఫ్లెక్సీ ప్రింటింగ్ నిర్వాహకుడు ప్రతాప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ రాయుడు, జనరల్ లాపరోస్కోపిక్ సర్జన్ ఎస్ మన్సూర్ భాష పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా ఆదివారం లక్కీ ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ల మాట్లాడుతూ ఆత్మకూరు మండల పరిధిలోని గ్రామాల ప్రజలు, పట్టణ ప్రజలు లక్కీ ఫ్లెక్సీ ప్రింటింగ్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, లక్కీ ఫ్లెక్సీ ప్రింటింగ్ నిర్వాహకుడి బంధువులు తదితరులు పాల్గొన్నారు.