
ఆత్మకూరు
నందికుంట లో ఎలుగుబంటి హల్చల్
భయాందోళనలో గ్రామ ప్రజలు.. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది.
====================================
తెలుగు వార్త న్యూస్:ఆత్మకూరు రూరల్.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని నందికుంట పరిసర ప్రాంతాల్లో, ఎలుగుబంటి బుధవారం నాడు హల్చల్ చేసింది. గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు కేకలు వేసి ఎలుగుబంటి ని పంట పొలాల్లోనికి పారద్రోలారు. అటవీశాఖ అధికారులు స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని ఎలుగుబంటి ని అడవిలోనికి తరిమికొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.