ANDHRABREAKING NEWS

ఘటికురాలే..సిఫారసు చేయిస్తే దీంతానానే

విధి నిర్వాహణలో నిక్కచ్చిగా.ఎస్ ఐ ముబీన్ తాజ్

ఘటికురాలే…

సిఫారసు చేయిస్తే దీంతానానే

బహిరంగంగా మద్యం,

ధూమపానం నిషేధం

భాదితులకు అండగా….

విధి నిర్వాహణలో నిక్కచ్చిగా…..

ఎస్ ఐ ముబీన్ తాజ్

 

తెలుగు వార్త :

ఆత్మకూరు

ఎందరో అధికారులు అందులో కొందరే విధి నిర్వాహణలో నియమ నిభందనలు పాటిస్తూ చట్టం ఎవరి చట్టం కాదని నిరూపిస్తూ

విధి నిర్వాహణలో ముక్కు సూటిగా,నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు కొందరే. ఆలాంటి కోవకు చెందినవారే నందికొట్కూరు నియోజక వర్గం కొత్త పల్లి మండల ఎస్ ఐ ముబీనా తాజ్. పోలీసు స్టేషన్ ముందు తమ సిబ్బంది తో వాహనం ఎక్కారంటే నేరస్తుల గుండెల్లో దడ పుట్టాల్సిందే. అన్యాయం జరిగిందంటూ పోలీసు స్టేషనుకు వచ్చే బాధితులకు అండగానిలిచి అరాచక శక్తులపై పోలీసు కొరడా ఝులిపిస్తూ పోలీసు శాఖకు వన్నె తెస్తున్నారు . మహిళ చట్టాలపై దైన శైలిలో వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు నిరంతర సేవలు అందింస్తూ ప్రజాభిమానాన్ని పొందారు.ఎక్కడ సంఘటన జరిగినా సంఘటన స్థలానికి చేరుకొని బాధితులకు అండగా నిలిచి నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించి శిక్షలు పడేలా చేసి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు.ఎన్ని వత్తిళ్లు ఎదురైనా ప్రలోభాలకు గురిచేసిన తలోగ్గకుండా చట్ట బద్ధంగా విధులు నిర్వహించడం వల్ల ఉన్నతాధికారులు మన్ననలు పొందుతున్నారు. స్టేషన్లో పిర్యాదుల కోసం ప్రత్యేక కౌంటర్ ను ఏర్పాటు చేశారు.ప్రతి పిర్యాదును కూలంకషంగా పరిశీలించి చట్ట బద్దమైన చర్యలకు పూనుకుంటారు.పిర్యాదు దారుల సమక్షంలోనే నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించి నిజా నిజాలు నిగ్గు తల్చేందుకు ప్రయత్నిస్తారు.అనంతరం తప్పు చేసిన వారిపై కేసు నమోదు చేసి కట కటాల పాలు చేస్తారు.స్టేషన్ కు వచ్చే వారి పట్ల స్నేహ పూర్వకంగా మాటలాడి పలు ప్రశ్నలు వేసి నిజ నిజాలు బిగ్గుతెల్చితారు.పేద ప్రజల పట్ల సానుకూలంగా వ్యవహరించి వారికి న్యాయం జరిగేలా చేస్తారు. హత్య నేరాల పై సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఉన్నతాధికారుల సహా సహకారాలతో నిందితులను గుర్తించి జైలు పాలు చేస్తారు.,ప్రత్యేకంగా మహిళల కు తన పోన్ నెంబర్ ఇచ్చి సమస్యలు వుంటే పోన్ చెయ్యండి ఐదు నిమిషాలలో మీముందు ఉంటానని బరోసా ఇచ్చారు. అనాథలను ,అభాగ్యుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారి ఆరోగ్య స్థితి గతులను పరిశీలించి అవసరమైన వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వారికి తగు సహాయ సహకారాలు అందించి కరుకు చాటున కరుణ హృదయమే కాదు అమ్మలాంటి ప్రేమ దాగివుందని నిరూపించారు.వృద్ధుల పట్ల ప్రేమ పూర్వకంగా మాటలాడి వారి పరిస్థితులపి ఆరా తీసి కుటుంబ సభ్యులను స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి వారి చెంతకు చేరుస్తున్నారు.ఎస్ ఐ మూబీనా తాజ్ మానవత్వం తో చేస్తున్న క్రియలను పలువురి ప్రశంసిస్తున్నారు.మద్యం సేవించి తగాదాలు సృష్టించే వారికి పోలీసు కౌన్సిలింగ్ ఇచ్చి గౌరవంగా జీవించాలని కుటుంబాల పోషణకు సంపాదన ఖర్చు చేయాలని చెప్పి వారిలో మార్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కొత్త పల్లి మండలంలో ప్రస్తుతం బహిరంగ ప్రదేశాలలో ధూమ ,మద్య పానం సేవించడానికి ఎవరూ సాహసించడం లేదంటే చట్టం ఏమేరకు అమలు అవుతుందో ఇట్టే అర్థమవుతుంది.కన్నీటితో పోలీసు స్టేషన్లో మహిళలు అడుగుపెడితే చాలు మద్యం ప్రియుల మద్యం మత్తు వదలాల్సిందే.మద్యం ప్రియుల పట్ల ఎస్ ఐ వ్యవహరిస్తున్న తీరు విధి నిర్వహణలో భాగంగా ఎస్ఐ ముబీనా తాజ్ చేస్తున్న సేవల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!