
చలివేంద్రం ప్రారంభోత్సవం
తెలుగు వార్త :
ప్రజల నీటి దాహార్తిని తీర్చుటకై నంద్యాల జిల్లాలోని ఆర్యవైశ్య అఫీషియల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గాంధీ చౌక్ నందు నీటి చలివేంద్రం కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ ఆర్థిక సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేశారు.
” కీర్తిశేషులు సముద్రాల వెంకటనారాయణ శెట్టి ఆశయాల భాగంలో కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ వేసవికాలంలో ప్రజల నీటి దాహమును తీర్చుటకై అవోపా వారికి గత 5 సంవత్సరములుగా చలివేంద్రం ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించడం జరుగుతున్నది.భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలకు బ్యాంక్ సహాయ సహకారాలు ఉంటాయని బ్యాంక్ అధ్యక్షులు అయిన మాఘo సురేంద్ర గుప్త తెలియజేశారు.”
ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షుడు వంకదారి గోపాలకృష్ణ మరియు వారి కార్యవర్గ సభ్యులు, కోవెలకుంట్ల కో-ఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ చౌడూరు వెంకట కృష్ణమూర్తి, బ్రాంచ్ మేనేజర్ గుంటూరి నాగరాజు శర్మ, సిబ్బంది హుస్సేన్ వలి పాల్గొన్నారు.