
ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే శిల్పా
ఆత్మకూరు రూరల్ , జూలై 26, (తెలుగు వార్త న్యూస్) :
శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామానికి చెందిన కాగుల లావణ్య గ్రామ వాలంటరీగా విధులు నిర్వహిస్తుంది. గత 15 రోజుల క్రితం లావణ్య భర్త కాగుల శ్రీధర్ కు యాక్సిడెంట్ అయ్యి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని శ్రీపతిరావుపేట గ్రామ నాయకులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి గ్రామ వాలంటరీ లావణ్య ద్వారా యాక్సిడెంట్ వివరాలు గురించి తెలుసుకుని భర్త కాగుల శ్రీధర్ కు మెరుగైన వైద్యం కొరకు తన సొంత నిధుల నుండి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. గ్రామ వాలంటరీ లావణ్య, గ్రామ నాయకులు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్,గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.