ANDHRABREAKING NEWSTELANGANA
వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు
తెలుగు వార్త. న్యూస్.రుద్రవరం.డిశంబర్ 28మండల కేంద్రం రుద్రవరం సమీపంలో వెలసిన శ్రీ వాసాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి గోపీ శర్మ ఆధ్వర్యంలో ధూప దీప నైవేద్యాలతో పూజా కార్యక్రమాలు కుంకుమార్చన నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు కర్నూలు, నంద్యాల ,ప్రకాశం ,కడప, జిల్లాల నుంచి భక్తులు చేరుకొని ఘనంగా పూజలు నిర్వహించారు. పూజలకు హాజరైన భక్తులకు నిర్వాహకులు అల్పాహారం ఏర్పాటు చేశారు.