
ఆంద్రప్రదేశ్ అగ్నిమాపక వారోత్సవాలు 6వ వార్డు కౌన్సిలర్ ముఫ్తి నూర్ మొహమ్మద్
తెలుగు వార్త :
ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అగ్నిమాపక కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని,ప్రసంగించిన 6వ వార్డు కౌన్సిలర్ ముఫ్తి నూర్ మొహమ్మద్ మరియు మున్సిపల్ కమిషనర్.
ముఫ్తి నూర్ మొహమ్మద్ మాట్లాడుతూ అగ్నిమాపక సిబ్బంది ప్రజలకు ఏంతో సేవ చేస్తున్నారని తెలిపారు.
తమ ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మంటల్లో చిక్కుకున్న వారిని రక్షిస్తారని తెలిపారు.మరియు విపత్తు శాఖ నుండి ఆర్ధిక సహాయం చేసేలా చర్యలు చేయడం అభినందనీయం అన్నారు.
ప్రజలందరూ వీరి సేవలను గుర్తించి, అభినందించాలని కోరారు.కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది,అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.