
షూటింగ్ బాల్ క్రీడలో రాణించాలి.
:బి.జె.వై.ఎం. ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి.
తెలుగు వార్త కర్నూలు స్పోర్ట్స్ న్యూస్:-
ప్రతి రోజూ క్రీడలు సాధన చేయడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని ఒత్తిడి తగ్గి ఉత్సాహవంతంగా పని చేయగలుగుతారని బి.జె.వై.ఎం. ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి పేర్కొన్నారు. బి క్యాంప్ బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరం లో పాల్గొన్న క్రీడా దుస్తుల దాత డాక్టర్ బైరెడ్డి శబరి క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ప్రసంగిస్తూ షూటింగ్ బాల్ క్రీడ భారత మంత్రిత్వశాఖ గుర్తించిన 64 క్రీడల్లో ఇది ఒకటి అని, ఈ క్రీడలు ఆడడం వలన దాని ద్వారా వచ్చిన ప్రశంసా పత్రాలు వలన కేంద్ర ప్రభుత్వ విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని తెలిపారు. క్రీడాకారులకు తన వంతు ప్రోత్సాహం అందిస్తానని తన వంతు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ సహకారంతో కర్నూలు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న షూటింగ్ బాల్ వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొన్న క్రీడాకారులకు అనంతరం క్రీడా దుస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు బి.జె.పి. అసెంబ్లీ ఇంచార్జ్ కొండే పోగు చిన్న సుంకన్న , ఆంధ్ర ప్రదేశ్ షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పరుశ రాముడు , వ్యాయామ ఉపాధ్యాయులు రమ్య , స్వాములు బేగం, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు