
వైసీపీ పాలనలో బాదుడే బాదుడు
తెలుగు వార్త :
ఆత్మకూరు : రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ప్రజలకు సంక్షేమం పేరుతో గోరంత సొమ్ము అందించి, ప్రజల వద్ద నుండి పన్నుల రూపంలో కొండంత సొమ్ము గుంజిందని రాష్ట్ర మాజీ హజ్ కమిటీ కమిటీ చైర్మన్ మొమిన్ అహమ్మద్ హుస్సేన్, మాజీ శ్రీశైల దేవస్థాన చైర్మన్ వంగాల శివరామి రెడ్డి, మాజీ సర్పంచ్ గోవింద రెడ్డి లు పేర్కొన్నారు. ఆదివారం పట్టణం లోని 6వ వార్డు లో బాదుడే బాదుడు నిరసన ర్యాలీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం పెంచిన అధిక ధరలపై కరపత్రాలను గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఎన్నికల ప్రచార సందర్భంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలను కోరి అధికారాన్ని చేపట్టి, ఇప్పుడు ప్రజలపై పెద్ద ఎత్తున పన్నులు మోపుతూ బాదుడే బాదుడును రుచి చూపించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి మొమిన్ ముస్తఫా,పట్టణ అధ్యక్షుడు జెట్టి వేణు గోపాల్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్లాపురం బాషా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు కలిముల్లా, రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి నాగుర్ ఖాన్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి వెన్నా శ్రీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు శివ ప్రసాద్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, రాజా రెడ్డి, శాబుద్దిన్, షేక్ నజి, న్యామత్, గౌస్, హబిబుల్లా,సుబ్బా రాజు, శ్రీనివాసులు, నగేష్, మోహన్,సతీష్, రియజుద్దిన్, జకీర్, హాషం,ఖాజా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.