
రాజకీయాలకు సెలవు
మాజీ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ అహమ్మద్
కర్నూలు ప్రతినిధి, డిసెంబర్ 27, (తెలుగు వార్త న్యూస్):
ప్రజాలకు మరింత సేవ చేసేందుకు రాజకీయాలకు రాజీనామా చేస్తున్నాని వైసిపి నాయకులు, మాజీ ఐఎఎస్ అధికారి ఇంతియాజ్ అహమ్మద్ అన్నారు. గురువారం మొగల్రాజుపురంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాసేవా చేయడం, సాహిత్యం, పేదరికంలేని సమాజం చేయలనే లక్ష్యానికి రాజకీయాలు అడ్డంకిగా మారాయని అన్నారు. కర్నూలు ప్రజలకు సేవా చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్నికలలో నిలబటం జరిగిందన్నారు. ఫలితం తెలిసీందే అనే అన్నారు. ఎన్జీవోలతో కలసి పేదరికం లేని సమాజం కోసం కృషీ చేస్తున్నాని అన్నారు. ప్రజాసేవా చేయడానికి మరింత అవకాశం లభిస్తున్నాని కర్నూలు ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు.