
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించి.. మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో & ప్రగతి పథంలో నిలుపుదాం
వరదయ్యపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ పద్మప్రియ దామోదర్ రెడ్డి
తెలుగు వార్త న్యూస్:వరదయ్యపాలెం
ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందేలా కృషి చేసి మండలాన్ని ప్రగతి పథంలో, జిల్లాలోనే ప్రధమస్తానంలో నిలపాలని ఎంపీపీ పద్మప్రియ దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. వరదయ్యపాలెం ఎంపిడివో కార్యాలయంలో శనివారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఆయా శాఖల అధికారులు తమతమ శాఖల ప్రగతి పనుల పురోగతి గురుంచి వివరించారు. కరెంటు సమస్యలపై ఎంపీటీసీ సామర్ల భువనేశ్వరి, జెడ్పీటీసీ, సర్పంచుల సంఘం అధ్యక్షుడు చంద్రారెడ్డి విద్యుత్ శాఖ AE ని నిలదీశారు. చిన్న పాండురు పంచాయతీ vkry కాలనీలో 87మంది గిరిజనులు ots పథకం వర్తించకుండా పథకాన్ని సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని కావున వాటిని పరిష్కరించి ots ద్వారా నగదు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని రాచెర్ల సెగ్మెంట్ ఎంపీటీసీ సామర్ల భువనేశ్వరి తహసీల్దార్ ఐ సుబ్రమణ్యంను కోరారు.. కార్యక్రమంలో జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు, ఎంపిడిఓ సుబ్రమణ్యంరాజు, వైస్ ఎంపీపీ బొప్పన పద్మావతి, సింగిల్ విండో ఛైర్మెన్ హరిరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్, ఎంపీటీసీలు సర్పంచ్ లు,కో ఆప్షన్ సభ్యులు సిద్దిక్ పాల్గొన్నారు.
గమనిక
ఈ సమావేశానికి పశు వైద్యాధికారి హాజరు కాలేదు. ట్రైనింగ్ కి వెల్లినందున హాజరు కాలేదని సిబ్బంది తెలిపారు.