సేవకు మారు పేరు బుడ్డా
సేవకు మరు పేరు బుడ్డా రాజశేఖర్ రెడ్డి : వెన్న శ్రీధర్ రెడ్డి
200 మందిని పరీక్షించిన వైద్యులు..ఉచితంగా మందులు పంపిణీ.
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు.
ఒక మంచి మాట మనసుకు ఓదార్పు నిస్తుంది. రోగంతో బాధ పడే వారికి ఒక మందు ఏంతో ఉపశయనాన్ని ఇస్తుంది.పట్నం వెళ్ళి వైద్యులను సంప్రదించడానికి కుటుంబ ఆర్థిక స్థితి సహకరించక పల్లెల్లో ఉన్న వైద్యుల చెంతకు వెళ్లినా రోగం నయం కాక,తాత్కాలిక,దీర్ఘ కాలిక రోగాలతో భాధ పడే వారికి శ్రీశైలం నియోజక వర్గం తెలుగు దేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరెడ్డి సహకారంతో నంద్యాల శాంతి రామ్ వైద్యుల పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆత్మకూరు స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తెలుగు దేశం పార్టీ తెలుగుయువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్న.శ్రీధర్ రెడ్డి,తెలుగుయువత నియోజకవర్గ నాయకులు అబ్దుల్ కలాం ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వస్తే విద్యార్థులు కోలుకోవడం కష్టమవుతుంది అనే ఉద్దేశంతో మాజీ ఎమ్మెల్యే బుడ్డా ఉచిత మెడికల్ క్యాంప్ శాంతిరామ్ హాస్పిటల్ వారిచే ఏర్పాటు చేశారన్నారు. ఉచిత వైద్య శిబిరం విద్యార్థులకు ఎంతో ఊరట కలిగించింది.ఆత్మకూరు మండలం బైర్లుటి గ్రామంలోని గురుకుల పాఠశాల ఆవరణంలో శాంతి రామ్ వైద్యులు డాక్టర్.ఎలీషా,తెజేష్,జసంత,నవీన రెడ్డి, పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో కీళ్ల నొప్పులు,జ్వరం,నరాల బలహీనత,దగ్గు, ఆయాసము సుగర్,గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులను వైద్యులు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు రక్త పరీక్షలు, బిపి పరీక్షలు నిర్వహించారు.వ్యాధి తీవ్రతను బట్టి నంద్యాల శాంతి రామ్ వైద్యశాలను సంప్రదించాలని సూచించారు.బుడ్డా రాజశేఖరెడ్డి అందించిన సేవా భావాన్ని దృష్టిలో విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది కిషోర్ బాబు, వైవీ.రమణ, జీలని,ప్రసాద్,సుబ్రమణ్యం,అబ్దుల్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.