BREAKING NEWSPOLITICSSTATE

వాలంటరీల పనితీరు భేష్

అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శం :  ఎమ్మెల్యే శిల్పా

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కి ఘనంగా స్వాగతం పలికిన శ్రీపతి రావు పేట, ఇందిరేశ్వరం నాయకులు.

99% హామీలు నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మా వైఎస్ఆర్ ప్రభుత్వం.

జగనన్న సురక్ష ప్రోగ్రామ్ ను అందరూ సద్వినియోగం చేసుకోండి.

వాలంటరిల పనితీరు బేష్.

ప్రతిపక్ష అసత్య ప్రచారం నమ్మొద్దు.

సర్వీస్ చార్జీలు లేకుండా సేవలు.

అందుబాటులోకి రానున్న 11 ఉచిత సేవలు.

తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు రూరల్ :

శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే  శిల్పా చక్రపాణి రెడ్డి ఆత్మకూరు మండలం వెంకటాపురం  సచివాలయం పరిధిలో నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లడుతూ

సర్వీస్ చార్జీలు లేకుండా అందజేసే సేవలు

కులధ్రువీకరణ పత్రం

నివాస ధ్రువీకరణ పత్రాలు

డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్,మరణ ధ్రువీకరణ పత్రం,

భూ కొనుగోలు అనంతరం ఆన్లైన్లో నమోదు,

ఆన్లైన్లో భూమి వివరాల నమోదులో మార్పులు చేర్పులు,

వివాహ దృవీకరణ పత్రం( పట్టణ ప్రాంతాల్లో 90 రోజుల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 60 రోజుల్లో).

ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ అప్డేట్,

కౌలు గుర్తింపు కార్డులు,

కొత్త రేషన్ కార్డు లేదా రేషన్ కార్డు విభజన,

ప్రభుత్వ డేటా కు సంబంధించి కుటుంబ వివరాలు కొంతమంది సభ్యులు పేర్లు తొలగింపు,

ఇవన్నీ అందుబాటులో ఉంటాయని దీని ప్రజలు ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలియజేశారు.శ్రీశైలం నియోజకవర్గంలోని  ఐదు మండలల్లో ఒక్కొక్క మండలానికి ఒక్కో జేసీఎస్ ఇంచార్జిలను  నియమించి,ఆమండలం

లోని మండల స్థానిక నాయకులు మరియు గృహసారదులను కలుపుకొని సచివాలయాల పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్ళి అర్హత ఉండి లబ్ధి పొందని వారిని గుర్తుంచి వారికి సంబందించిన సచివాలయలలో లబ్ధిదారులకు ప్రభుత్వ పధకాలు అందజేయాలని దృడ సంకల్పం తో ముందుకు సాగె ఈ బృహత్తర కార్యమే ఈ జగనన్న సురక్ష అని ఎమ్మెల్యే కొనియాడారు.అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలని  ఇంకా ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి అందని వారికి ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారని,

అదేవిధంగా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్న జగనన్నకు చెబుదాం ప్రోగ్రాం ద్వారా మీ సమస్య వివరంగా తెలియజేయాలని వార్డు ప్రజలకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి తెలియజేశారు.అంతేకా కుండా ఈరోజు రాష్ట్రంలో మా వాలంటీర్ల పనితీరుపనితీరు మీద ప్రతిపక్షాలైన ప్యాకేజీ నాయకులు, వృద్ధ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మా వాలంటీర్లు అందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు  ప్రజల కుటుంబాల దగ్గర తీసుకెళ్తుంటే  జీర్ణించుకోలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఈ విషయాన్ని ప్రజలు తిప్పి కొట్టాలని తెలియజేశారు.అదేవిధంగా ఈ ప్రతిపక్ష నాయకులు సవాల్ విసిరుతున్న దమ్ముంటే సచివాలయ వ్యవస్థను వాలెంటరి వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి ప్రజల్లోకి రావాలని హెచ్చరించారు.అంతేకాకుండా ఈరోజు ప్రతి కుటుంబం దగ్గర ప్రభుత్వ పథకాలు గాని ప్రజలకు అవసరమైన ప్రభుత్వ వ్యవస్థనే వాళ్ళ కుటుంబం దగ్గరికి తీసుకెళుతున్న వారదులే మా వలంటర్లని అలాంటి వారిపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలకు దుష్ప్రచారం చేస్తున్న ప్యాకేజీ నాయకులకు మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేదని తెలియజేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు మొత్తం ఏకమై రండి మళ్లీ జగనన్న ప్రభుత్వనికే ప్రజలందరి ఆశీర్వాదం ఉందని తెలియజేశారు.గ్రామ ప్రజలు దగ్గరి నుంచి వచ్చే వినతులు స్వయాన్ని ఎమ్మెల్యే పరిశీలించి  పరిష్కారం చేయాలని అధికారులు ఆదేశించారు.అదేవిధంగా కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు మంజూరైన పత్రాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికెట్లకు సంబంధించిన పత్రాలను ప్రజలకు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల,టౌన్ పార్టి ప్రెసిడెంట్, జడ్పిటిసి సభ్యులు, ఎంపీపీ, వైస్ ఎంపీపీ,  గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు,సింగల్ విండో చైర్మన్, మార్కెట్ యార్డ్ చైర్మన్ ,మున్సిపల్ కౌన్సిలర్లు, జే సి ఎస్ కన్వీనర్,  గ్రామనాయకులు, గ్రామ గ్రామ సీనియర్ నాయకులు,కార్యకర్తలు,అధికారులు, సచివాలయ సిబ్బంది,సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు,వాలంటీర్లు, గ్రామ సచివాలయ  ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!