
స్వామి అమ్మవారికి ఎన్టీఆర్ అభిమానులు కొబ్బరికాయలు సమర్పణ
శ్రీశైలం తెలుగు వార్త: న్యూస్(మార్చి 30):-శ్రీశైలం మండలం ఎన్టీఆర్ అభిమానులు కర్నూల్ టౌన్ వైడ్ జిల్లా ప్రెసిడెంట్ శేఖర్ చౌదరి ఆధ్వర్యంలో శ్రీశైలం మండల ప్రెసిడెంట్ సిరాజ్,అలిబాష ఆధ్వర్యంలో అల్ టైం రికార్డు బద్దలు కొట్టి అంతకుమించి కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి మంచి విజయం తో ముందుకు వెలుతున్న సందర్భంగా శ్రీశైలం మండలంలోని ముఖద్వారం వద్ద 108 టెంకాయలు స్వామి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ శేఖర్ చౌదరి,శ్రీశైలం మండలం ఎన్టీఆర్ సేవ సమితి ప్రెసిడెంట్ సిరాజ్ ,అలిబాష.చక్రి.హాబీబ్ అశోక్ మొదలగు అభిమానుకు పాల్గొన్నారు.