తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు.
89వ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి.
నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని స్థానిక 12వ వార్డులో 89వ రోజు గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి వార్డులో ఉన్న ప్రతి గడపగడపకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా వార్డు ప్రజానీకం కుల మతాలకతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో శ్రీశైలం నియోజకవర్గం లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిని రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటామని హర్షం వ్యక్తం చేశారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అశేష జనవాహిని మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి, వైసిపి పట్టణ అధ్యక్షులు సయ్యద్ మీర్, మండల అధ్యక్షులు రాజమోహన్ రెడ్డి, ఎంపీపీ ఎన్. తిరుపాలమ్మ, నాగన్న, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మారూఫ్ ఆసియా, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఎం ఏ రషీద్, జడ్పిటిసి జి. శివశంకర్ రెడ్డి,
పువ్వాడి భాస్కర్. కౌన్సిలర్లు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగస్తులు, వార్డు ఇన్చార్జిలు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు గృహ సారథులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.