ANDHRABREAKING NEWSBUSINESSCRIMEPOLITICSSPORTSSTATETELANGANAWORLD

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకటనారాయణ రెడ్డి

నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వెంకటనారాయణ రెడ్డి.

శుభాకాంక్షలు తెలియజేసిన తెలుగు వార్త ఎడిటర్ ఎస్కే జలీల్.

ఆత్మకూరు, తెలుగు వార్త న్యూస్ :

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి నూతన బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. మంగళవారం పోలీస్ స్టేషన్ ఎస్సై కార్యాలయం నందు తెలుగు వార్త ఎస్కే జలీల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ పూల బొక్కే ను అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ తన ధ్యేయమని అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటల పాటు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను అని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేయటంలో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకారం అందించాలని, ఎలాంటి సమస్యలు ఉన్న నేరుగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం నందు ప్రభ న్యూస్ ఎడిటర్ నాగరత్నం, తెలుగు వార్త టౌన్ రిపోర్టర్ వనమాల పుల్లయ్య, మెట్రో ఉదయం చంద్రశేఖర్, తెలుగు వార్త టీవీ రిపోర్టర్ షాకీర్ భాష, తదితరులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!