రాయలసీమ లో కొత్త సినిమా కర్కశం డైరెక్టర్ జీ.నాగేశ్వర రావు(GNR)
రాయలసీమ లో కొత్త సినిమా కర్కశం డైరెక్టర్ జీ.నాగేశ్వర రావు(GNR)

రాయలసీమ లో కొత్త సినిమా కర్కశం డైరెక్టర్ జీ.నాగేశ్వర రావు(GNR)
తెలుగు వార్త :
జి.నాగేశ్వర రావు(GNR)తన సొంత ఊరు గడిగరేవుల తండ్రి వెంకటయ్య,తల్లి సుబ్బలక్ష్మమ్మ సొంత ఊరు నంద్యాల జిల్లా గడిగారేవుల
ఆయన డైరెక్టర్ అవ్వాలని కోరిక చిన్నతనంలో అంటే సుమారు తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ సమయంలో సినిమాలంటే ఈయనకు పిచ్చి కానీ తను ఉండే ఊరు చిన్న గ్రామం ఒక చిన్న గ్రామంలో ఒకటే ఇంటికి టీవీ ఉండేది తను ఆదివారం వచ్చే సినిమా కోసం ఎదురు చూసేవారు ఆదివారం వచ్చిందంటే చాలు ఆ టీవీ వున్న ఇంటికి వెళ్లి ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు వచ్చే సినిమా చూసేవారు… ఆ చిన్న వయసులోనే సినిమాలంటే మక్కువ ఎక్కువ టీవీలో సినిమా చూస్తున్నప్పుడు ఈ సీన్ ఇలా ఉంటే బాగుండేది ఆ సీన్ అలా ఉంటే బాగుండేది అని అనుకునేవారు జీ.నాగేశ్వర రావు (GNR)డైరెక్టర్ వారి ఊరికి పది కిలోమీటర్ల దూరంలో సినిమా హాల్ ఉండేది.. అంత దూరం కాలినడకతో వెళ్ళి సినిమా చూసేవారు అలా మొదలైన ఆ పిచ్చి సినిమా కథలు రాసే వరకు వెళ్ళింది అప్పటి నుండి ఇండస్ట్రీకి కు వెళ్లాలని అనుకునేవారు ఆయన చదువు ఇంకా పూర్తి కాకపోవడంతో డిగ్రీ వరకు చదువుకొని ఇంట్లో ఎవరి మాట వినకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారు హైదరాబాదులో ఇండస్ట్రీకి వెళ్లడమే పెద్ద సక్సెస్ గా భావించే వారు, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది సినిమా కష్టాలు ఎలా ఉంటాయో అని.. తను ఎన్నో ఆఫీసుల చుట్టూ స్టూడియోల చుట్టూ తిరిగి తిరిగి అలసి పోయేవారు, ఎవ్వరూ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు మరికొందరు రేపు రా, ఎల్లుండి రా, రెండు నెలలు తర్వాత చూద్దాం, ఆరు నెలలు తర్వాత చూద్దాం, కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సినిమాకు చూద్దాం అనేవాళ్ళు ఎవరు ఛాన్స్ ఇచ్చే వాళ్ళు కాదు, అలా ఫిలిమ్ నగర్ టు కృష్ణానగర్ వరకు తిరిగి తిరిగి అలసి పోయేవారు ఎవరు కరెక్ట్ గా సమాధానం చెప్పేవారు కాదు…
జి.నాగేశ్వర రావు(GNR) 15 సంవత్సరాలుగా సినిమా ఇండస్ట్రీలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ ఎక్కువ కాలం ఎమ్మెస్ రాజు సార్ గారి దగ్గర తూనీగా తూనీగా సినిమా నుండి ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాను ఎమ్మెస్ రాజు గారి వద్ద వర్క్ చేయడం వల్ల స్క్రీన్ప్లే మీద బాగా పట్టు సాధించాను అదేవిధంగా ఎమ్మెస్ రాజు గారిని అందరూ ఇండస్ట్రీలో లో కింగ్ మేకర్ అని పిలుస్తారు ఆయన మేకింగ్ సూపర్ గా ఉంటుందని ఆయన దగ్గర వర్క్ చేయడం వల్ల మేకింగ్ మీద మంచి కమాండింగ్ వచ్చిందని జి.నాగేశ్వరరావు(GNR) అన్నారు ఆయన దగ్గర కాకుండా మిగతా డైరెక్టర్ల దగ్గర కూడా వర్క్ చేశాను అయితే నేను వర్క్ మీద కమాండింగ్ సంపాదించింది మాత్రం ఎమ్మెస్ రాజు గారి సినిమాల వలే ఎందుకంటే లేట్ నైట్ డిస్కషన్ లో కూడా నేను పక్కనే ఉండే వాడిని అందువల్ల స్టోరీ ఎలా రాస్తారు ఎలా డిస్కషన్ చేశారు ఇలాంటి విషయాలని నేను ఎమ్మెస్ రాజు సార్ గారి దగ్గర నేర్చుకున్నాను…
మొన్న వచ్చిన మహమ్మారి కరోనా కు కొంచెం ముందే నేను ట్రైల్స్ లో ఉన్నాను అలా రెండు సంవత్సరాలు గడిచిపోయింది. అందువల్ల స్వీయ దర్శకత్వం చేయవలసి వచ్చింది జి. నాగేశ్వరావు మొదట అనుకున్న స్టోరీ ని పక్కనపెట్టి తక్కువ బడ్జెట్ అయ్యే స్టోరీ కోసం వెతుకుతూ ఉంటే జి.నాగేశ్వరరావు(GNR) తను ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఈనాడు పేపర్ లో వచ్చిన చిన్న సంఘటనను చదివి చలించిపోయారు అప్పుడే అనుకున్నాడు ఈ సంఘటన జనాలకు తెలియాలి అని అప్పుడు డిజిటల్ కెమెరాలు లేవు షార్ట్ ఫిలిమ్స్ కి ఎక్కువ ఖర్చు అయ్యేది, ఆ స్టోరీ లైన్ నోట్ బుక్ లో రాసి పెట్టుకున్నారు ఆ సంఘటన ఇప్పుడు కర్కశం సినిమాగా డైరెక్షన్ చేస్తున్నాను ఈ సినిమా 75% షూట్ అయిపోయింది ఇంకా 25% మాత్రమే ఉంది ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి ఎమ్మెస్ రాజు గారు కూడా బాగా ఎంకరేజ్ చేశారు ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిలు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి ఇప్పుడు కర్కశం స్టోరీ కరెక్ట్ గా ఉంటుందని భావించి స్వయంగా ఆరు నెలల నుంచి స్టొరీ మీద కూర్చొని డెవలప్ చేసుకున్నారు ఇది నా మొదటి సినిమా కాబట్టి ఆర్టిస్టులను కొత్తవాళ్లను తీసుకోవాలని భావించి నా ప్రాంతంలో నంద్యాలలో ఆర్టిస్టులను తీసుకోవాలని ఏ ఫ్లాట్ఫామ్ లేక చాలా మంది టిక్ టాక్ రోల్స్, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరిని తన సినిమాలో కొత్త వాళ్లను పరిచయం చేయాలని అనుకున్నారు ఆరు నెలలుగా ఆ సినిమాకు కావలసిన ఆర్టిస్టులను అందరిని తీసుకున్నారు… సినిమా టైటిల్ గురించి ఆలోచించి డిజైన్ చేయించారు చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది ఆ టైటిల్ రిలీజ్ కి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు వచ్చి ఆ టైటిల్ ని చూసి డిఫరెంట్ గా ఉందని చెప్పారు అప్పుడే నా ఆలోచన అర్థమైంది అని డైరెక్టర్ జి.నాగేశ్వరావు(GNR)అన్నారు స్టొరీ విషయానికొస్తే క్రైమ్ సస్పెన్స్ అన్ని కలిసి ఉంటాయి చూసిన వారికి సమాజం మీద మంచి సినిమా తీశారు అనేలా ఉంటుంది ఈమధ్య అమ్మాయిల చిన్న పిల్లల మీద జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు చూస్తుంటే సొంత బంధువులు అనుకొని నమ్మించి వాళ్లే ఇలా చేస్తున్నారని ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్ లో కూడా చదివాను ఈ సినిమాలో డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉంటుంది సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల మీద ఫోకస్ చేస్తూనే వినూత్నంగా చేయాలనే తపనతో ఈ సినిమా (కర్కశం) తీశాను డైరెక్టర్ జి.నాగేశ్వరరావు(GNR) అన్నారు అదేవిధంగా సమాజానికి మంచి సందేశం కూడా ఉంటుంది ఇవన్నీ మేళవించి చేసిన సినిమానే కర్కశం. టైటిల్ చూసి అందరూ బాగుందని చెప్పారు… ఈ స్టొరీ ని నా ఫ్రెండ్స్ కి నా శ్రేయోభిలాషులకు చెప్పినప్పుడు అందరూ చాలా బాగుందని ఎంకరేజ్ చేశారు ఈ సినిమా కర్కశం ప్రారంభోత్సవానికి డిఎస్పి మహేష్ గారు కర్నూల్, ఓర్వకల్ ఎస్ఐ మల్లికార్జున గారు, రావడం జరిగింది డీఎస్పీ సార్ గారు హీరో వెంకట్ చెప్పిన ఓడితే ఒక్కన్ని గెలిస్తే మీరందరూ అనే డైలాగ్ కి క్లాప్ కొట్టగా ఎస్ఐ మల్లికార్జున గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు
ఈ సినిమా ఏప్రిల్ 11 కి ప్రారంభోత్సవం అయ్యి నిర్వరాయంగా మొదటి షెడ్యూల్ పూర్తి చేసి రెండవ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకొని మూడో షెడ్యూల్ కి సిద్ధమవుతుంది. ఈ షెడ్యూలతో సినిమా పూర్తి అవుతుంది GNR ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ ఫై జి.నాగేశ్వరరావు(GNR) స్వీయ దర్శకత్వం వహిస్తూ చేస్తున్న ఈ సినిమా 70% పూర్తిచేసుకుంది మూడో షెడ్యూల్ తో 30% సినిమా పూర్తవుతుంది.. ఎడిటింగ్ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి ఆగస్ట్ 2022 లో సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా నా పేరు మీనాక్షి, రాధమ్మ కూతురు, సీరియల్స్ లో మెయిల్ లీడ్ చేసిన అదేవిధంగా మైత్రివనం,రాయలసీమ లవ్ స్టోరీ సినిమాలలో హీరోగా చేసిన వెంకట్ మా కర్కశం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు… అలాగే చరిత,టిక్ టాక్ ప్రేమలత, మన్యం పులి గోపి వేణుగోపాల్,పద్మ, రవి,రేష్మి,మహేశ్వరి, సూర్యనారాయణ, రమేష్ బాబు, పుష్పరాజ్, బెంగుళూరు సతీష్, విశ్వ, ఈశ్వర్, ప్రసాద్, చంద్ర మొదలగువారు ఈ సినిమాలో నటిస్తున్నారు నేను మన రాయలసీమలో టాలెంట్ ఉన్న వారిని తప్పకుండా నా వచ్చే సినిమాలో అవకాశం కల్పిస్తానని నన్ను మీరందరూ ఎంకరేజ్ చేసి నా సినిమా కర్కశం మూవీ ని చూసి అందరూ ఆశీర్వదించాలని కోరుతూ మీ కర్కశం సినిమా డైరెక్టర్ జి.నాగేశ్వరరావు (GNR)