ANDHRABREAKING NEWS

సిద్దేశ్వరం జల దీక్ష విజయవంతం చేద్దాం 

మే 31 2022 ఉదయం 10 గంటలనుండి సిద్దేశ్వరం దగ్గర

సిద్దేశ్వరం జల దీక్ష విజయవంతం చేద్దాం

 

మే 31 2022 ఉదయం 10 గంటలనుండి సిద్దేశ్వరం దగ్గర

తెలుగు వార్త :

రాయలసీమ ప్రజల హృదయ స్పందన సిద్దేశ్వరం అలుగు నిర్మాణం కోసం గత ఆరు సంవత్సరాలుగా రాయలసీమ రైతాంగం ప్రజలు స్వచ్ఛందంగా అనేక ఉద్యమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న విషయం విధితమే వేలాది మంది ప్రజల ఉద్యమస్ఫూర్తితో చేపట్టిన రాజకీయ పార్టీలు ఇప్పుడిప్పుడే గళం విప్పుతున్నదుకు వారికి ధన్యవాదాలు…

 

రాజకీయ పార్టీలు కేవలం మాటలతో వాగ్దానాలతో ప్రజలను మురిపించి మోసపుచ్చకుండ రాయలసీమ అభివృద్ధికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాము ఆ దిశగా పాలక ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు వారి బాధ్యత గుర్తు చేసేందుకై సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన ఆరవ వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని రాయలసీమ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాము….

 

సిద్దేశ్వరం అలుగు నిర్మాణం వలన శ్రీశైలం రిజర్వాయర్ కు పూడిక ప్రమాదం ఉండదని తద్వారా శ్రీశైలం ప్రాజెక్టు జీవితకాలం పెరుగుతుందనీ శ్రీశైలం డ్యాంకు రక్షణగా ఉంటుందని రాయలసీమకు కేటాయించిన నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా సీమా వినియోగించుకోవచ్చని హైదరాబాద్ నుండి ప్రకాశం,సీమ జిల్లాలకు రోడ్డు మార్గం 50 కిలోమీటర్ల తగ్గుతుందని అత్యంత తక్కువ ఖర్చుతో ఎలాంటి భూసేకరణ లేకుండా అలుగు నిర్మించ పచ్చని శ్రీశైలం రిజర్వాయర్ క్రింద భూములు కోల్పోయిన నందికొట్కూరు ప్రాంతంలోని ఎత్తిపోతల పథకాలకు నీటి లభ్యత ఉంటుందని ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయని అందువల్ల అలుగు నిర్మాణం ఆవశ్యకమని ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు తో ఏర్పాటుచేసిన ఇంజనీర్ ఇన్ చీఫ్ కమిటీ సిఫారసు చేయడాన్ని ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను…

 

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కల్వకుర్తి నంద్యాల జాతీయ రహదారిలో విభాగంగా సిద్ధేశ్వరం వద్ద నిర్మించిన వంతెన తో పాటు అలుగు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ తో జలదీక్ష చేద్దాం…

 

రాయలసీమ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన చట్టబద్ధ నీటిని వినియోగించడానికి వారి ఓవర్ రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టాలని ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ మరియు బచావత్ ట్రిబ్యునల్ సూచనలు చేసింది కానీ ఆ దిశగా కార్యాచరణ చేపట్టడంలో పాలకులు దశాబ్దాలుగా నిర్లక్ష్యం వహించారు. దీనితో కృష్ణా నదికి ఎగువన ఉన్న రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నీళ్లలో సగం కూడా వాడుకలో లేని పరిస్థితులు నెలకొన్నాయి ఆ విధంగా వినియోగించు కొనలేని నీరు కృష్ణానదికి దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు తరలిపోతున్నది దీనితో కృష్ణా డెల్టాకు రబీ పంట కాలానికి (ఎండాకాలం) బచావత్ కేటాయించిన 37498 ఎకరాలకు బదులుగా పది లక్షల ఎకరాలకు సాగునీరు మూడు లక్షల ఎకరాల చేపల చెరువులకు నీరు అందుతున్నది సీమ వాసుల నీటి హక్కులను వినియోగించుకోలేక పోవడానికి కారణం సాగునీటి నిర్మాణాలను చేపట్టకపోవడం ఏ అని వేరే చెప్పాలా రాయలసీమ ప్రాజెక్టులకు ఎక్కువగా ఉన్నా నీటిని సంపూర్తిగా వినియోగించుకోవడానికి చేపట్టవలసిన నిర్మాణాలపై జలదీక్ష చేద్దాం…

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న రాయలసీమ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలి ఈ ప్రాజెక్టులకు శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటి ఆవిరి కై కేటాయించిన చట్టబద్ద నీటి హక్కు లోని మిగులు నీరు పట్టిసీమ చింతలపూడి మరియు పులిచింతల రిజర్వాయరు నిర్మాణాల ద్వారా ఆదాయం నీటిని తక్షణమే కేటాయించాలని జల దీక్ష చేద్దాం….

 

రాయలసీమ సంప్రదాయ వనరులైన చెరువులు కుంటలు, నిర్మాణము/పునరుద్ధరణ వీటికి వాగులు, వంకలు, నదులు, కాలువల తో అనుసంధానం మరియు సామాజిక అడవుల పెంపకం,పర్యావరణ పరిరక్షణతో పెన్నా నది పునర్జీవనం లక్ష్యంతో రాయలసీమ పర్యావరణ పరిరక్షణ కమిషన్ ఏర్పాటు జల దీక్ష చేద్దాం….

 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా కృష్ణ యాజమాన్య నోటిఫికేషన్లో సవరణలకై జల దీక్ష చేద్దాం…

 

కృష్ణా జలాల నిర్వహణకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూల్లో కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని జలదీక్ష చేద్దాం…

 

రాయలసీమ సాగునీటి అవసరాలకు కీలకమైన శ్రీశైలం రిజర్వాయర్ పూడికతో ఒక చిన్న మడుగు గా మారకముందే పూడిక ను నివారించే సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టడానికి జలదీక్ష చేద్దాం….

 

సముద్ర పాలవుతున్న కృష్ణా జలాలను నిలువరించి రాయలసీమకు త్రాగు, సాగునీరు అందించడానికి సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని జలదీక్ష చేద్దాం…

 

శ్రీశైలం రిజర్వాయర్ కు రావలసిన నీటి కంటే అదనంగా (1056.58 టీఎంసీ) మీరు చేరిన ఈ సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ శ్రీశైలం రిజర్వాయర్ కు కేటాయించిన 60 టీఎంసీల క్యారీ ఓవర్ నీటిని వచ్చే సంవత్సరం వాడుకోవడానికి శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం పైన నిర్వహించి ఉండాలి అంటే సంగమేశ్వరం గుడి గోపురం కూడా కృష్ణా జలాల్లో మునిగి ఉండాలి. అంటే సంగమేశ్వరం గుడి గోపురం కూడా కృష్ణా జలాలలో మునిగి ఉండాలి. కానీ నీ మోకాలి లోపు నీరు కూడా లేకుండా శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేసి బురద మిగిల్చిన పాలకుల నిర్లక్ష్యాన్ని ఇక సహించమని హెచ్చరిక చేస్తూ జల దీక్ష (బురుదలో దీక్ష )చేద్దాం…

 

రాయలసీమ న్యాయమైన కోరికల సాధన కోసం జరిగే జలదీక్ష కార్యక్రమంలో లో రాయలసీమ ప్రజానీకం, ప్రజాస్వామ్య వాదులందరూ స్వచ్ఛందంగా పెద్దఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమానికి తమ తమ గ్రామాల నుండి స్వచ్ఛందంగా ట్రాక్టర్లతో తరలిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాము

 

రాయలసీమ సాగునీటి సాధన సమితి..

రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సభ్య సంస్థ…

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!