
తెలుగు వార్త న్యూస్(తిరువూరు తిరువూరు మండలంలో జి.కొత్తూరు సచివాలయం నందు జగనన్న సురక్ష కార్యక్రమములో వివిధ రకాల 11 సర్వీసులను గ్రామ ప్రజలకు అందజేయుటలో భాగంగా క్యాంప్ కార్యక్రమము నిర్వహించి 1196 కి పైగా సర్టిఫికెట్లను గ్రామ ప్రజలకు అందజేయడము. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆధార్ నమోదు కేంద్రం ఏర్పాటు చేసి 27ఆధార్ సేవలను ఇప్పటి వరకు ప్రజలకు అందజేయడం.
ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ నూతక్కి సురేష్ బాబు, ఈవోపీఆర్డీ వెంకటరత్నం, సర్పంచ్ శీలం వెంకట్రావమ్మ, మాజీ పి ఏ సి ఎస్ అధ్యక్షులు శీలం కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి పి. పని గోపాల్ , గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు