
పేదలకు అపోలో టైర్స్ కంపెనీ చేయూత
స్వచ్ఛ గ్రామాలుగా వరదయ్య పాలెం మండలం VKRYకాలనీ రాచెర్లలని తీర్చిద్దడానికి అపోలో వారిచే మరుగుదొడ్ల వసతి కల్పన
తెలుగు వార్త: న్యూస్:వరదయ్యపాలెం
పేద గిరిజన ఎస్సీ కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం సౌకర్యం కల్పించి స్వచ్ఛభారత్ ఆశయ సాధనకు కృషి చేస్తున్నట్లు అపోలో టైర్ల పరిశ్రమ ప్రతినిధులు సాయిబాబా తెలిపారు.
వరదయ్యపాలెం మండలం చిన్నపాండురు పంచాయతీ VKRY కాలనీ, రాచెర్లలలో మరుగుదొడ్లు లేని పేద కుటుంబాలకు అపోలో పరిశ్రమ యాజమాన్యం తమ crs లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టి చేయూతనిచ్చారు.
ఈ సందర్భంగా కంపెనీ hr మేనేజర్ c రాజ్ మాట్లాడుతూ రాచెర్ల చిన్నపాండురు పంచాయతీలలో తొలిదశలో 74 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించామని, రెండవ దశలో 66 మరుగుదొడ్లు నిర్మించామని అన్నారు
పరిశ్రమ యాజమాన్యం సామాజిక సేవా దృక్పథాన్ని స్థానిక సర్పంచ్ లు శ్యామల సుబ్రమణ్యం, ఈస్వరమ్మ దనంజయులు ఎంపీటీసీ సామర్ల భువనేశ్వరి, హరి ఉప సర్పంచ్ దేవెళ్ళ మహేంద్ర, స్థానిక గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.