BREAKING NEWSCRIMESTATE
ఎస్ఐ అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన చెలిమిల చంద్ర

ఎస్ఐ అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిసిన… చెలిమిల చంద్ర
తెలుగు వార్త న్యూస్: పాములపాడు.
పాములపాడు మండలానికి ఇటీవల బదిలీపై వచ్చిన నూతన ఎస్ ఐ అశోక్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై ని చెలిమిల చంద్ర మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే ఇచ్చి స్వీటును అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ అశోక్ మాట్లాడుతూ.. పాములపాడు మండల పరిధిలో ఉన్న గ్రామాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు. గ్రామాల్లో యువతీ యువకులు ప్రతి ఒక్కరూ చెడుమార్గంలో వెళ్లకుండా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ఉండాలని, ప్రభుత్వం చేపట్టబోయే పోటీపరీక్షల్లో రాణించాలని ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి సమాజంలో ఎదగాలని యువతను ఉద్దేశించి మాట్లాడారు. మట్కా గుట్కా నాటుసారా వంటి అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.