శ్రీ చైతన్య హైస్కూల్ నుండి నాసా ఐఎస్డిసి
కాన్ఫరెన్స్ కు 6 మంది విద్యార్థులు ఎంపిక.

శ్రీ చైతన్య హైస్కూల్ నుండి నాసా ఐఎస్డిసి కాన్ఫరెన్స్ కు 6 మంది విద్యార్థులు ఎంపిక.
====================
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు మే నెలలో జరగనున్న నాసా ఐ ఎస్ డి సి కాన్ఫరెన్స్ లో 6 మంది విద్యార్థులు ఎంపికయ్యారని ఏజీఎం సురేష్ తెలిపారు. ప్రపంచంలో ఏ ఇతర విద్యాసంస్థలకు రానటువంటి అవకాశం శ్రీ చైతన్య హై స్కూల్ కు లభించడం ఆనందంగా ఉందన్నారు. శ్రీ చైతన్య విద్యా సంస్థల నుండి 66 విన్నింగ్ ప్రాజెక్ట్స్ రావటం విశేషం అన్నారు. మొత్తం 1065 మంది విద్యార్థులు విన్నింగ్ ప్రాజెక్ట్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నందు ఆర్ ఐ చౌదరి, ప్రిన్సిపాల్ ఎన్. ఉమా, సత్యనారాయణ రెడ్డి, ఏవో లోకేశ్వర్ రెడ్డి, మరియు ఉపాధ్యాయులు నాసా ఇంచార్జి సురేష్ బాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.