ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం

ఆత్మకూరు లో ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం.
తెలుగు వార్త న్యూస్:ఆత్మకూరు టౌన్.
విధినిర్వహణలో ప్రాణాలర్పించిన అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఫారెస్ట్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ వెంకటరమణ అన్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్స్ మరియు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విధినిర్వహణలో అసువులు బాసిన అటవీ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్ ఎస్ ఓ వెంకటరమణ మాట్లాడుతూ… అటవీ సంపదను రక్షించేందుకు అటవీశాఖ అధికారులు మరియు సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. అమరులైన అటవీ అధికారుల సేవలను గుర్తు చేసుకున్నారు. ఇది చాలా బాధాకరం అన్నారు. ప్రకృతి వనరులను రక్షించడంలో అటవీశాఖ అధికారులు సిబ్బంది నిరంతరం సేవలు అందిస్తున్నారని తెలిపారు. తదనంతరం ఆత్మకూరు ప్రభుత్వ హాస్పటల్ నందు బాలింతలకు రోగులకు పండ్లను పంపిణీ చేశారు. కరివేన సమీపంలోని ఎస్ఆర్బీసీ లో ఉన్న వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, ఆత్మకూరు యూనిట్ సెక్రెటరీ సెక్షన్ ఆఫీసర్ అసోసియేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.