మృతుడి పులిచెర్ల బయ్యన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి
తెలుగు వార్త :

మృతుడి పులిచెర్ల బయ్యన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఐటీడీఏ పీవో రవీంద్రారెడ్డి
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక వెంగళ రెడ్డి కాలనీకి చెందిన పులిచెర్ల చెంచు బయన్న ఇటీవల అనారోగ్యంతో మరణించారు. మృతుడి పులిచెర్ల బయ్యన్న కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయి జీవించడమే చాలా కష్టంగా ఉన్నా పరిస్థితుల్లో వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవీంద్ర రెడ్డి 5000/- రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆ భగవంతుడు ఈ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని కోరుకున్నారు. మృతుడు పులిచెర్ల బయ్యన్న కుటుంబాన్ని పరామర్శించారు. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి లో ఉన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు వైసీపీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ ఆలీ, కౌన్సిలర్లు హరి, బోయ రాముడు, వెలుగు పథకం సిసి మహబూబ్ బాషా, మాజీ కౌన్సిలర్ తిమోతి తదితరులు పాల్గొన్నారు.