
మహిళలకు భద్రత దిశ యాప్
SI. హరి ప్రసాద్.
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు టౌన్.
దిశ యాప్ ను సెల్ లలో డౌన్లోడ్ చేసుకోవాలని ఆత్మకూర్ పట్టణ ప్రజలకు, వివిధ గ్రామాల నుండి ఆత్మకూరు పట్టణానికి అవసరాల నిమిత్తం వస్తున్నా ప్రజలకు ఆత్మకూరు ఎస్సై హరిప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ప్రజలకు దిశ యాప్ పై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ… మహిళలకు రక్షణ దిశ యాప్ కాబట్టి ప్రతి ఒక్కరు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలియజేస్తూ, తానే కొంతమందికి దిశ యాప్ ను సెల్ లో డౌన్లోడ్ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.