ANDHRABREAKING NEWS

చెంచుగూడెం లలో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు : శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రవీంద్ర రెడ్డి 

ఆత్మకూరు :తెలుగు వార్త

చెంచుగూడెం లలో ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు : శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రవీంద్ర రెడ్డి

 

తెలుగు వార్త న్యూస్ : ఆత్మకూరు

ఆత్మకూరు.మండల పరిధిలోని చెంచు గూడెంలో గిరిజనులు చెంచులు ,ఆధార్ కార్డు లేని చెంచులను గుర్తించి,ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను గిరిజనులు చెంచులు పొందే విధంగా చర్యలు చేపడుతున్నామని శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రవీంద్ర రెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేసే ఇప్పటికి 175 మంది చెంచులకు ఆధార్ కార్డు ఎన్రోల్మెంట్ చేశారు. గురువారం ఆత్మకూరు లోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆధార్ నమోదు కేంద్రం ద్వారా చెంచులకు ఆధార్ రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఐ డి డి ఏ పిఓ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ…. కర్నూలు జిల్లా పరిధిలో ఆయా చెంచు గూడెంలో చాలామంది చెంచులకు ఆధార్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, నా దృష్టికి వచ్చిందని దీంతో చెంచులకు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలను, దీంతో చెంచు గిరిజనులకు ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే వీరికి ఆధార్ కార్డులు రానున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఎ జిల్లా స్పెషల్ ఆఫీసర్ కేజీ నాయక్, ఎంపీడీవో మోహన్ కుమార్, వెలుగు సి సి మహబూబ్భాష తదితరులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!