
కర్ణాటక మద్యం పట్టివేత
అక్రమ మద్యం అమ్మిన, రవాణా, చేసిన కఠిన చర్యలు తప్పవు
ఆదోని వన్ టౌన్ సీఐ విక్రంసింహ
తెలుగువార్త: (ఆదోని)
కర్నూలు జిల్లా ఆదోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేదరి గేరి గేటు వద్ద గల ఫ్లైఓవర్ వద్ద సరైన సమాచారం మేరకు వాహనాల తనిఖీలో భాగంగా తనిఖీలు చేస్తుండగా శ్రీనివాస్ మరియు శేఖర్ అనే ఇద్దరు వ్యక్తులు ఎవరికి అనుమానం రాకుండా ఒక బస్సులో నాగరాళ్లు గ్రామం నుండి కర్ణాటక మద్యం ను కొనుగోలు చేసి ప్రయాణికులు లాగా ఎవరికి అనుమానం లేకుండా ప్రయాణిస్తూ, ఆదోని లోని మేదిరిగేరి దగ్గర ఉన్నా బ్రిడ్జి వద్ద అక్కడ క్రిందకు దిగి రెండు బట్టలు పెట్టుకొనే లగేజ్ బ్యాగ్ లో సుమారుగా 412 ఆఫీసర్స్ ఛాయిస్ టేట్ర ప్యాకెట్లు తీసుకొని బోయగేరి కి వెళ్తున్నట్టు గా తెలుసుకొని వారిని అదుపులోకి తీసుకొని వారి నుండి టెట్రా పాకెట్స్ ను స్వాధీనం చేసుకొని విచారణ చేయగా వీరు బోయగేరి లోని బోయ లక్ష్మి,మరియు ముంబై లక్ష్మి, అనే వాళ్లకు ఈ కర్ణాటక మద్యం ప్యాకెట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. శేఖర్, శ్రీనివాసులు, బోయ లక్ష్మి మరియు ముంబై లక్ష్మి అను నలుగురిని అదుపులోకి తీసుకుని, 412 ఆఫీసర్స్ ఛాయిస్ ప్యాకెట్లు ను సీజ్ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది అని వన్ టౌన్ సీఐ విక్రం సింహ తెలిపారు. ఎవరైనా సరే ఇలాంటి అక్రమ రవాణా మద్యం, కానీ పేకాట కానీ అక్రమ ఇసుక లాంటి విషయాలు తెలిస్తే మాకు తెలియచేయండి తెలిపిన వారి పేర్లు ను గొప్యంగా ఉంచుతామని తెలిపారు.