నాటుసారా బట్టీల పై మెరుపుదాడులు

నాటుసారా బట్టీల పై మెరుపు దాడి ఆత్మకూరు ఎస్సై హరి ప్రసాద్.
===============
నాటు సారా తయారు చేయటం, అమ్మడం మట్కా,పేకాట ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక చేసిన ఎస్ఐ హరిప్రసాద్.
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు రూరల్.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని నల్లకాల్వ గ్రామ శివారులో ఉన్న నాటుసారా బట్టి లపై గురువారం నాడు ఆత్మకూరు ఎస్సై హరిప్రసాద్, పోలీస్ సిబ్బందితో వెళ్లి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సారాయి తయారు చేయడానికి ఉపయోగించే 1250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 20 లీటర్ల సారా సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై హరి ప్రసాద్ మాట్లాడుతూ… సారాయి తయారు చేయటానికి వినియోగిస్తున్న సామాగ్రిని మండల కేంద్రం నుంచి పలు గిరిజన గ్రామాలకు చేరుతున్నట్లు తెలుస్తుందని దీనిపై నిఘా పెంచుతున్నట్లు తెలిపారు. ఆత్మకూరు మండలంలో నాటు సారా తయారు చేయటం, అమ్మడం, మట్కా, పేకాట లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ దాడుల్లో పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.