ANDHRABREAKING NEWS

“ప్రజా సంక్షేమ ప్రభుత్వం మాది- నందికొట్కూరు…. ఎమ్మెల్యే తోగూరు. ఆర్థర్    

తెలుగు వార్త

“ప్రజా సంక్షేమ ప్రభుత్వం మాది- నందికొట్కూరు…. ఎమ్మెల్యే తోగూరు. ఆర్థర్

తేలుగు వార్త : నందికొట్కూరు నియోజకవర్గం లోని పాములపాడు మండల కేంద్రంలో ఎమ్మెల్యే తోగూరు. ఆర్డర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప- గడపకు కార్యక్రమంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం మాది అని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తొగురు. ఆర్థర్ గారు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రవేశపెట్టిన నవరత్నాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రజలు అడిగిన సమస్యల గురించి ఆ సంబంధిత అధికారులతో చర్చించి అక్కడే సమస్యలను పరిష్కారం చేయడం జరిగింది. అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయాలకతీతంగా అవినీతికి తావు లేకుండా, దళారీ వ్యవస్థకు చెక్ పెట్టి నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ అయ్యే విధంగా చేసినామన్నారు. అన్ని రకాల పెన్షన్లు, చౌక దుకాణాల సరుకులు, ప్రజలకు ఇంటివద్దనే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇంకా కొత్త కొత్త పథకాలు ప్రజా సంక్షేమం కోసమే అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు సీఐ సుధాకర్ రెడ్డి,తాసిల్దార్ వేణుగోపాల్ రావు, ఎస్ ఐ- డి .రాజ్ కుమార్, ఎంపీడీవో రానెమ్మ, ఎంఈవో బాలాజీ నాయక్, ఏవో- ఫనీశ్వ రెడ్డి, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ వి.రామ సుబ్బయ్య, మండల వైస్ ప్రెసిడెంట్ బండ్లమురి. వెంకటేశ్వర్లు, మండల కో ఆప్షన్ నెంబర్ సయ్యద్.మూర్తుజా అలీ, మండల వైసిపి నాయకులు ముడియాల. రమణారెడ్డి, రామలింగారెడ్డి, చౌడయ్య, రాములమ్మ,, శివలింగం, ఎం పి యు పి ఉర్దూ స్కూల్ చైర్మన్ షేక్షావలి, ఎంజిఎన్ఆర్ఇజిఎస్- ఏపీఎం, ఐ కె పి ఏ పి ఓ, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్- ఇంజనీర్లు, వైద్య సిబ్బంది, సర్పంచులు, ఎంపిటిసిలు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు తదితర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!
12:04