
అంభేధ్కర్-ఫూలే క్రీడా ముగింపు వేడుకలు
ఒంగోలు ( తెలుగు వార్త) జైభీం ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంభేధ్కర్-ఫూలే జయంతి క్రీడోత్సవాలలో భాగంగా బుధవారం డిఆర్ఎం హైస్కూలులో కర్రసాము,డప్పు కళ పోటీలు,కబడ్డి పోటీలు విజయవంతంగా ముగిసాయి. 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ జయంతి, క్రీడా ఉత్సవాలు జరిగాయి.
క్రికెట్ పోటీల ఫైనల్ పోటీ హోరాహోరీగా జరిగింది.ఫైనల్స్ లో ఎస్సార్సీ సుబ్బారావు,చినగంజాం టీం గెలుపొందినది.ట్రోఫీతో పాటు నగదు బహుమతి గెలుపొందారు.మ్యాన్ ఆఫ్ ది సిరిస్ సోనూ క్రృపాకర్,ఒంగోలు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రమేష్ అందుకున్నారు.రన్నర్స్ గా జైభీం యూత్ ఒంగోలు,మూడో స్ధానం వై సిసి,నెహ్రూకాలనీ,ఒంగోలు, నాలుగో స్ధానం లివింగ్ లెజెండ్ టీం,కావలి గెలుపొందారు.
కబడ్డీ పోటీలలో పలు గ్రామాల నుండి వచ్చిన కబడ్డీ క్రీడాకారులు తమ సత్తా చూపించారు.ఉదయం నుండి రాత్రి దాకా నిరంతరాయం గా కబడ్డీ పోటీలు క్రీడా స్పూర్తిని పెంచేలా అద్భుతంగా జరిగాయి.కబడ్డీ క్రీడలో బాయ్స్ ట్రోఫీ విన్నర్ గాయత్రి మినరల్స్,చినగంజాం ట్రోఫీ,నగదు బహుమతి గెలుపొందారు. రెండో స్ధానం వినోదరాయపాలెం కబడ్డీ టీం, మూడో స్ధానం ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల,కందుకూరు గెలుపొందారు.బాలికల విభాగంలో సక్కబాయమ్మ మహిళా కళాశాల, ఒంగోలు రన్నర్స్ గా ఏకేవికే ఒంగోలు టీం ట్రోఫీ,నగదు బహుమతులు గెలుపొందారు.
ప్రజాకవి డాక్టర్ మొగిలి దేవ మాట్లాడుతూ.. జైభీం నాగేశ్వరరావు యువతలో ఎలాంటి అంతరాలు ఉండకుండా సోదర భావం పెంచేందుకు, మహనీయుల స్పూర్తిని యువతలో పెంచేందుకు అట్టహాసంగా క్రీడలను నిర్వహించడం అభినంధనీయమన్నారు.కష్టపడి పనిచేసి ఈ ఉత్సవాలను విజయవంతం చేసిన జైభీం యూత్ కి అభినంధనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలన్నీ జైభీం యూత్ చిక్కాల కిరణ్,కోచ్ మార్కు, ప్రజాకవి డాక్టర్ మొగిలి దేవ,మరియదాసు, నత్తల శ్రీనివాస్, గురు భరత్ ,హ్రదయరాజు,క్రృపారావు తదితరుల ఆధ్వర్యంలో జరిగింది.