తెలుగు పజల ఆరాధ్యదైవం ఎన్ టి రామారావు
రక్తదానం ప్రాణదానం తో సమానం : మాజీ ఎమ్మెల్యే బుడ్డా

తెలుగు పజల ఆరాధ్యదైవం ఎన్ టి రామారావు:
రక్తదానం ప్రాణదానం తో సమానం : మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి.
===============================
తెలుగు వార్తన్యూస్:ఆత్మకూరు టౌన్.
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ జెండా ఎగరవేసి, ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక టిడిపి పార్టీ కార్యాలయం నందు శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళవారంనాడు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయడం ప్రాణాన్ని నిలబెట్టడం అని తెలియజేశారు. రక్తదానం చేసిన వ్యక్తికి కొత్త రక్తం తయారై ఎంతో ఆరోగ్యంగా ఉత్తేజంగా ఉంటారని తెలిపారు. ప్రతి వ్యక్తి ఏడాదికి ఒక సారి రక్త దానం చేయడం ఎంతో మంచిదని పిలుపునిచ్చారు. మానవుడే మాధవుడు అని,అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న అని, ఎవరైనా రక్తదాతలు రక్తాన్ని దానం చేసి మరొక ప్రాణాన్ని కాపాడవచ్చు అని అన్నారు. రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, తాను సమాజ సేవలో ముందు ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమము నందు టిడిపి నాయకులు, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్ మోమిన్ ముస్తఫా, రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహమ్మద్ హుస్సేన్, నంద్యాల పార్లమెంట్ టిడిపి అధికార ప్రతినిధి మోమిన్ ముస్తఫా, అబ్దుల్లాపురం భాష, కురుకుంద మల్లికార్జున్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.