
ఎం అర్ పి ధరలకే విక్రయాలు జరపాలి తాసిల్దార్ మాధవ
తెలుగు వార్త :
శిరివెళ్ల :- మండల పరిధిలోని ఆయా గ్రామాలలో గల నిత్యవసర సరుకుల దుకాణం వ్యాపారులు ఎంఆర్పి ధరలకే విక్రయాలు జరపాలని తాసిల్దార్ మాధవ పిలుపునిచ్చారు.
మండల పరిధిలోని ఎర్రగుంట్ల మేజర్ పంచాయతీ గ్రామంలో వినియోగదారులకు ఫిర్యాదు మేరకు నిత్యావసర సరుకుల దుకాణాలను సోమవారం తనిఖీ చేశారు
ఈ సందర్భంగా కొన్ని దుకాణాలలో ఎంఆర్పి ధరలకే ఫ్రీడమ్ ఆయిల్ ను విక్రయాలు జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు
వినియోగదారుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకునేందుకు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిష్టే చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
తాసిల్దార్ వెంట గ్రామ రెవెన్యూ అధికారి రఫీ మరియు భాస్కర్ రెడ్డి విఅర్ఏలు పాల్గొన్నారు