
ఆంధ్రప్రదేశ్ టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షుడు.మౌలానా ముస్తాక్ అహమ్మద్ కి దళిత నాయకులు ఘనస్వాగతం పలికారు…శ్రీశైలం నియోజక వర్గం ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం
దళిత,గిరిజనుల అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం ఆంధ్రప్రదేశ్ టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహమ్మద్
బుడ్డా రాజశేఖర్రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి…..
350 మంది దళిత,గిరిజనులు టిడిపి లో చేరిక
శ్రీశైలం నియోజక వర్గం ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం. ఆధ్వర్యంలో .350 మంది దళిత ,గిరిజనులు నుండి టిడిపి లో చేరనున్నట్లు..350 మంది దళిత ,గిరిజనులు సంతకాల వినతి. వినతిపత్రం.ఆంధ్రప్రదేశ్ టిడిపి మైనారిటీ సెల్ అధ్యక్షుడు మౌలానా ముస్తాక్ అహమ్మద్. ని అందించారు
తెలుగు వార్త :
ఆత్మకూరు
దళిత ,గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశం అధినేత,ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోనే సాధ్యం అని ఆంధ్రప్రదేశ్ టిడిపి మైనారిటీ సెల్ అద్యక్షులు మౌలానా ముస్తాక్ అహమ్మద్ అన్నారు.ఆదివారం ఆత్మకూరు పట్టణంలోని పాత బస్టాండ్ లోని శ్రీశైలం నియోజక వర్గం ఎస్సీ సెల్ కార్యదర్శి నాగరత్నం అధ్వర్యంలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ముందుగా మౌలానా ముస్తాక్ అహమ్మద్ గారికి దళిత నాయకులు ఘనస్వాగతం పలికారు.పూలమాల వేసి శాలువాతో సన్మానించారు.దళిత ,గిరిజనులను వైసిపి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని , రాజ్యాంగ బద్దంగా కేంద్రం విడుదల చేస్తున్న ఉప ప్రణాళిక నిధులను ఎస్సీ ఎస్టీ ల కోసం ఖర్చు చేయకుండా నవరత్నాల కు మల్లించిందని నాగరత్నం,రాజేష్ లు 350 మంది దళిత ,గిరిజనులు వైసిపి నుండి టిడిపి లో చేరనున్నట్లు..350 మంది దళిత ,గిరిజనులు సంతకాల వినతి. వినతిపత్రం అందించారు ఆయనకు తెలిపారు
.అనంతరం ముస్తక్ అహమ్మద్ మాట్లాడుతూ శ్రీశైలం నియోజక వర్గంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. తెదేపా పాలనలో దళితులకు 27 సంక్షేమ పథకాలు అందించి అభివృద్ది బాటలో నడిపించారనీ తెలిపారు.వైసిపి పాలనలో దళిత,గిరిజనులకు ఒరిగింది ఏమీలేదని అన్నారు.వైసిపి ప్రభుత్వం దళితులపై దాడులు, మహిళల పై అత్యాచారాలు అధికమయ్యాయి అని బాధిత మహిళలకు చంద్రబాబు నాయుడు,తెదేపా జాతీయ అద్యక్షులు నారా లోకేష్ అండగా నిలిచి న్యాయ పోరాటం చేస్తున్నారని తెలిపారు.2024 లో తెదేపా అఖండ విజయం సాధిస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.వైసిపి పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు సమస్యలను నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుక వెళ్లి సమస్యల పరష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగూర్ ఖాన్,మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు కలిముళ్లా,తెలుగు యువత ప్రధాన కార్యదర్శి రేణుకా ప్రసాద్,నియోజక వర్గం,తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పస్పిల్ మున్నా,తెలుగు నాడు విద్యార్థి సంఘం నాయకుడు వెంకటేశ్వర గౌడ్, సీనియర్ నాయకులు చేపల మహెబూబ్ బాషా, దుబ్బ శ్రీను, నాగభూషణం.దానమయ్య,దళిత సంఘం నాయకులు కార్యర్తలు పాల్గొన్నారు