మణిపూర్ ఘటన ఆమానీయం
మణిపూర్ ఘటన ఆమానీయం ఆటవికం :ఐద్వా.
తెలుగు వార్త న్యూస్: ఆత్మకూరు.
మానవత్వాన్ని మంటగలిపేలా మణిపూర్ లో కుకీ మహిళలను వివస్త్రను చేసి సామూహిక సామూహిక అత్యాచారం చేయడాన్ని యావత్ భారతదేశం ఖండిస్తున్నదని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాలు దాసమ్మ, శ్రామిక మహిళా సంఘం నాయకురాలు భారతి లు అన్నారు.
శుక్రవారం మణిపూర్ లో జరిగిన ఘటనను నిరసిస్తూ అక్రమార్క ప్రజాతంత్రం మహిళా సంఘం ఆధ్వర్యంలో స్థానిక పాత బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం ముందర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 4వ తేదిన జరిగిన మణిపూర్ లో శాంతి భద్రతల పరిస్థితులు ఇంతలా దిగజారిపోయిన బిజెపి ఇంకా అటువంటి ముఖ్యమంత్రిని కాపాడేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించేందుకు 75 రోజులు పట్టిందని ఇంతకాలం ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని వారు అన్నారు. రెండు మాసాలకు పైగా రాష్ట్రంలో హింస చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అత్యంత సిగ్గుచేటైన విషయం అని అన్నారు. మణిపూర్ లో పరిస్థితులు చేయి దాటిపోతున్నప్పుడు మౌనంగా ఉండడం సమస్యకు పరిష్కారం కాదని అన్నారు. కుకీ మహిళలపై లైంగిక దాడులు వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవడం బిజెపి ఓటు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. మణిపూర్ ఘటనపై యావత్తు భారతదేశం ఒక తాటిపై నిలబడి ఇటువంటి అమానుసమైన ఘటనలను ఖండించాలని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.ఇప్పటికైనా మహిళలను అగౌరపరిచే వారిని కఠినంగా శిక్షించాలని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం గా వారు డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మహిళలు అపర్ణ వరలక్ష్మి శాంతి ఇందిరమ్మ లింగమ్మ సువార్తమ్మ, భాగ్యమ్మ సంతోషమ్మ కుమారి ప్రజా సంఘాల నాయకులు ఏ రణధీర్ జీ నాగేశ్వరావు పి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.