
ఘనంగా ఎమ్మెల్యే ఆదిమూలం జన్మదిన వేడుకలు
తెలుగు వార్త న్యూస్:సత్యవేడు
తిరుపతి జిల్లా సత్యవేడులో స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జన్మదిన వేడుకలను పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు ఘనంగా జరుపుకున్నారు.గురువారం వై ఎస్ ఆర్ సి పి జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు బిరేంద్ర వర్మ, సింగిల్విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి,గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.వైఎస్సార్ సీపీ శ్రేణుల కోలాహలం మధ్య వైఎస్ఆర్సిపి జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు బిరేంద్ర వర్మ, సింగిల్విండో అధ్యక్షులు నిరంజన్ రెడ్డి భారీ కేకును కట్ చేసి పురప్రజలకు పంచిపెట్టారు.తదనంతరం ఆదిమూలం జన్మదినాన్ని పురస్కరించుకొని దాదాపు 500 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి జిల్లా కార్మిక సంఘం అధ్యక్షులు బిరేంద్ర వర్మ మాట్లాడుతూ సత్యవేడు నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అంకితభావంతో పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు.అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో టిడిపి ఎమ్మెల్యేలు ఎవరు ప్రజా సమస్యలపై పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.అయితే గతంలో స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూసినప్పుడుగాని, అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్న ఘనత కేవలం ఒక్క సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కు మాత్రమే దక్కిందన్నారు.ఒక పక్క పార్టీ శ్రేణులు,మరోపక్క ప్రజలు ఏ సమస్య పైన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే అవి పరిష్కరించే వరకు ఎమ్మెల్యే విశ్రమించరు అన్నారు.పైగా నియోజకవర్గ సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులను కలిసి వారి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లడం జరిగిందన్నారు.ప్రజాసేవకు పునరంకితం అవుతున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు రాష్ట్ర క్యాబినెట్ మార్పుచేర్పుల లో మంత్రి పదవి లభించే అవకాశాలు మెండుగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎం పి టి సి రమణ సెల్వి,వెంకటరత్నమ్మ గురుప్రసాద్, సర్పంచు మధురాజు,వైఎస్ఆర్ సీపీ నేతలు రమణయ్య,రాజేష్,చంద్రబాబు,నారాయణ, గోవింద స్వామి,మాణిక్యం,రమేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.