ANDHRABREAKING NEWSPOLITICSSTATEWORLD

రైతుల పాలనా కొనసాగిస్తాం

శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి

రైతే రాజు

రైతుల పాలనా కొనసాగిస్తాం.. శ్రీశైలం…ఎమ్మెల్యే. శిల్ప చక్రపాణి రెడ్డి

ఆత్మకూరు నూతన మార్కెట్ యార్డ్ చైర్మన్ బాలస్వామి యాదవ్ ప్రమాణ స్వీకారం.

వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అబ్దుల్ రషీద్.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి.

తెలుగు వార్త న్యూస్ : ఆత్మకూరు.

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో చైర్మన్ మరియు నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అటహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో వైసిపి నాయకులు కార్యకర్తలు హాజరు కావడంతో మార్కెట్ యార్డ్ ప్రాంగణమంతా పండగ వాతావరణం సంతరించుకుంది.బీసీ సామాజిక వర్గానికి చెందిన బాలస్వామి యాదవ్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా, వైస్ చైర్మన్ గా అబ్దుల్ రషీద్, మిగతా పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేకు వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ శుభ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ…నూతన పాలకవర్గ సభ్యులు మరియు చైర్మన్ రైతులకు అందుబాటులో ఉండి రైతుల సమస్యల పరిష్కారానికి మీ వంతు సహకారం అందించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ లో ఉన్న రోడ్లను మరమ్మతు చేయించాలని అదేవిధంగా రూములను కూడా మరమ్మత్తు చేయించాలని తెలిపారు. నిత్యం ప్రజల కోసం కష్టపడే నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. అలాంటి ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చి రైతులు ఆశీర్వదించాలని అన్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం రైతుల పైన నాయకుల పైన ప్రజల మీద ఉందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మెరుగైన సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఆత్మకూరు పట్టణంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఉండటం మన అదృష్టం అని అన్నారు. యార్డులో అసంపూర్ణంగా ఉన్నటువంటి గోడౌన్లను పూర్తి చేయిస్తామని పేర్కొన్నారు. రైతులు తన వ్యవసాయ ధాన్యాన్ని భద్రపరచుకోవటానికి జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మహానంది మండలంలో ఇటీవల కాలంలో అకాల వర్షాలకు అరటి పంట ఎంత నష్టపోయిందని నష్టపరిహారం అందించమని పేర్కొన్నారు. రైతుల పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులను విత్తనాలను అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని పేర్కొన్నారు. రైతులకు తన వంతు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అందిస్తున్నారని ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వ్యవసాయ మార్కెట్ యార్డును అన్ని రకాలుగా అభివృద్ధి పథంలో నడిపించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ కమిటీ కార్యాలయం ఆవరణంలో ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిధిలోని వైసిపి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Telugu Vartha

Related Articles

Back to top button
error: Content is protected !!