
నంద్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన… ఎస్పీ రఘువీరా రెడ్డి.IPS
నంద్యాల క్రైమ్, ఏప్రిల్ 04, (తెలుగు వార్త: న్యూస్ ) :
నూతనంగా ఏర్పడుతున్న నంద్యాల జిల్లాకు ఎస్పీ రఘువీరా రెడ్డి ఐపియస్ తొలి ఎస్పీగా ఆదివారం రాత్రి బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
నంద్యాల జిల్లాకు తొలి ఎస్పీగా రావడం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డిజిపి కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఐపియస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలన్నారు.
జిల్లాలో నేరనియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని, మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
బాధితుడికి తక్షణ పరిష్కారం అందేలా కృషి చేస్తామని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగానికి ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని ఎస్పీ కోరారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వారు .
పోలీస్ శాఖ లో ఎస్సై గా పదవి బాధ్యతలు చేపట్టి, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ కాలం పని చేశారు.
నంద్యాల ఎస్పీ గా నియమించబడ్డారు
పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది జిల్లా ఎస్పీ గారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.