
రంజాన్ సందర్భంగా నిత్యావసర సరుకుల పంపిణీ – టిడిపి నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి మోమిన్ ముస్తఫా
తెలుగు వార్త :
ఆత్మకూరు.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభోత్సవం సందర్భంగా ముస్లింలు చాలా శ్రద్ధతో కఠోరమైన ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు.కానీ పేదరికంలో ఉన్న వారికి పెరుగుతున్న నిత్యావసర వస్తువుల రేట్లు అందుబాటులో లేక జీతభత్యాలు కూడా సరిగా లేని సందర్భంగా, నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని టిడిపి నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి మొమిన్ ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుసేన్ గారి ఆదేశాల మేరకు నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 4kgల బియ్యం, 1kg వంట నూనె, చక్కెర, ఉప్పు, అల్లం, సేమియాలు, గరం మసాలా, ఖర్జూర పండ్లు, గోధుమపిండి, అప్పడాలు, పచ్చడి పంపిణీ చేయడం జరిగింది అన్నారు.రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ అహ్మద్ హుసేన్ గారి ఆధ్వర్యంలో గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు శ్రీశైలం నియోజకవర్గం లో చేశామని గుర్తు చేశారు. పేదలకు సేవ చేయడంలో ఎప్పుడు వెనకాడబోమని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు ఇస్మాయిల్ జాబిఉల్లా,కౌన్సిలర్ ముఫ్తి నూర్ మహమ్మద్.,టీడీపీ యువ నాయకులు గౌస్ మాలిక్,టీడీపీ 6వ వార్డు ఇంచార్జి m. ఇలియజ్,జాబిఉల్లా,నబిసా మహేబూబ్,షఫీఉల్లా,గఫార్,మాలిక్,షెక్షా తదితరులు పాల్గొన్నారు..